వీకెండ్లో అల్ ఖౌద్ రోడ్డు మూసివేత
- July 27, 2018
మస్కట్: అల్ ఖౌద్ కమర్షియల్ రోడ్ స్ట్రీట్, ఈ వారంతంలో మూసివేయనున్నారు. జులై 26 సాయంత్రం నుంచి జులై 28 ఆదివారం వరకు ఈ మూసివేత అమల్లో వుంటుంది. రెగ్యులర్ మెయిన్టెనెన్స్ నిమిత్తం ఈ మూసివేతను అమలు చేస్తున్నట్లు అధికారులు పేర్కొన్నారు. ట్రాఫిక్ని ప్రత్యామ్నాయ మార్గాలవైపు మళ్ళిస్తున్నామని మస్కట్ మునిసిపాలిటీ ఓ ప్రకటనలో పేర్కొంది. రాయల్ ఒమన్ పోలీస్ సహకారంతో ఈ చర్యలు చేపట్టారు. అల్ ఖౌద్ కమర్షియల్ ఏరియాలో అల్ ఖౌద్ కమర్షియల్ రోడ్ మధ్యలో వుంటుంది. వాహనదారులు ట్రాఫిక్ సిబ్బంది సూచనల మేరకు వాహనాల్ని ప్రత్యామ్నాయ మార్గాల్లో మళ్ళించాల్సి వుంటుందని అధికారులు తెలిపారు.
తాజా వార్తలు
- రస్ అల్ ఖైమాలో విషాదం.. కనిపించకుండా పోయిన మహిళ మృతి..!!
- ఆసియన్ స్కూల్లో ఘనంగా ‘ఏక్తా 2026’ వేడుకలు..!!
- సౌదీలో 20 మందికి పైగా కార్మికులున్న సంస్థలకు షేర్డ్ హౌసింగ్ తప్పనిసరి..!!
- కువైట్‌లో బుక్ డొనేషన్ డ్రైవ్..!!
- యూఏఈలో ఆత్మహత్యాయత్నం ఇక నేరం కాదు..!!
- ఒమన్‌లో వరుస చోరీలు.. ఏడుగురు నిందితులు అరెస్ట్..!!
- దుబాయ్‌లో షేరింగ్ వసతికి అనుమతించిన ప్రాంతాల పూర్తి జాబితా..
- ఖతార్‌లో డ్రైవింగ్ స్కూళ్లకు కొత్త నిబంధనలు..!!
- ఏపీ భక్తులకు గుడ్ న్యూస్.. దేవీ నవరాత్రులకు ఉచిత విద్యుత్: మంత్రి లోకేష్
- ప్రధాని మోదీతో సీఎం చంద్రబాబు కీలక సమావేశం







