బంగారం, వెండి ధరలు మరింత తగ్గాయి
- July 27, 2018
న్యూఢిల్లీ: అంతర్జాతీయ పరిణామాల నేపథ్యంలో బంగారం డిమాండ్ బాగా తగ్గిపోయింది. స్థానిక నగల వ్యాపారుల నుంచి కొనుగోళ్లు లేకపోవడంతో బులియన్ మార్కెట్లో బంగారం ధర దిగొచ్చింది. శుక్రవారం మార్కెట్లో 10గ్రాముల బంగారం ధర రూ. 190 తగ్గడంతో రూ.30,740గా ఉంది.
నగల వ్యాపారుల నుంచి డిమాండ్ తగ్గడంతోపాటు ఈక్విటీ మార్కెట్లలో పెట్టుబడులు పెరగడం కూడా బులియన్ సెంటిమెంట్పై ప్రభావం చూపిందని మార్కెట్ల వర్గాలు చెబుతున్నాయి. ఇక వెండి ధరలు కూడా బంగారం బాటలోనే నడిచాయి.
గత రెండ్రోజులుగా పెరుగుదలను నమోదు చేసినప్పటికీ శుక్రవారం మాత్రం ధరలు తగ్గుముఖం పట్టాయి. పారిశ్రామిక వర్గాలు, నాణేల తయారీదారుల నుంచి డిమాండ్ పడిపోవడంతో వెండి ధర స్వల్పంగా తగ్గింది. రూ. 230 తగ్గడంతో శుక్రవారం మార్కెట్లో కిలో వెండి ధర రూ.39,200 పలికింది.
అంతర్జాతీయంగానూ బంగారం, వెండి ధరలు పడిపోయాయి. 0.73శాతం తగ్గిన బంగారం ధరలు.. న్యూయార్క్ మార్కెట్లో ఔన్సు ధర 1.222.40డాలర్లుగా ఉంది. 1.48శాతం తగ్గి ఔన్సు వెండి ధర 15.35డాలర్లుగా ఉంది.
తాజా వార్తలు
- తాజా సంస్కరణలతో సామాన్యులకు భారీ ఊరట
- శ్రీవారి బ్రహ్మోత్సవాలకు భారీ భద్రతా ఏర్పాట్లు
- వడ్డీ రేట్లను 25 బేసిస్ పాయింట్లు తగ్గించిన QCB..!!
- ఫోర్బ్స్ మిడిల్ ఈస్ట్ సస్టైనబిలిటీ లీడర్లలో నలుగురు కువైటీలు..!!
- పర్వతారోహణ సాధన చేస్తూ గాయపడ్డ వ్యక్తి..!!
- తవక్కల్నా యాప్ కొత్త ఇంటర్ఫేస్ ఆవిష్కరణ..!!
- ఇసా టౌన్ ప్రసిద్ధ మార్కెట్లో తనిఖీలు..!!
- రాస్ అల్ ఖైమాలో గ్యాస్ సిలిండర్ పేలుడు..!!
- ఈ నెల 30 వరకు ఏపీ అసెంబ్లీ
- రాహుల్ గాంధీ మరో బాంబు..మీడియా ముందుకు ‘సాక్ష్యాలు’..