ఇండియా:35 ఏళ్ల లోపువారికి ఇన్‌కం టాక్స్ రద్దు!

- July 27, 2018 , by Maagulf
ఇండియా:35 ఏళ్ల లోపువారికి ఇన్‌కం టాక్స్ రద్దు!

అవును.. ఇది నిజ్జంగా నిజం. అతిత్వరలో ఇది కార్యరూపం దాల్చినా ఆశ్చర్యం లేదు. యువకుల ఓటు బ్యాంకుని కొల్లగొట్టడం కోసం కాంగ్రెస్ పార్టీ ఎత్తుకున్న కొత్త స్లోగన్ ఇది! 2019 పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీని గెలిపిస్తే.. 35 ఏళ్ల లోపు వయసున్న వాళ్లందరికీ ఆదాయ పన్ను నుంచి మినహాయింపునిస్తామన్నది తాజా హామీ. ఈనెల 13న జరిగిన కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సమావేశంలో రాహుల్ ఈ ప్రతిపాదనపై సీరియస్ గా చర్చించినట్లు సమాచారం. ప్రయివేటు ఉద్యోగవర్గాల్ని బుట్టలో వేసుకోవాలంటే ఇదొక చక్కటి మార్గమని, సాధ్యాసాధ్యాలపై సలహాలు-సూచనలు తీసుకుంటున్నామని కాంగ్రెస్ పార్టీ ప్రతినిధులు చెబుతున్నారు. స్వల్ప ఆదాయ వర్గాలకు, ఆర్థికంగా నిలదొక్కుకునేవరకూ ఆదాయపన్ను కట్టే పని లేకుండా ఉపశమనం కలిగించడమే ఈ హామీ ఉద్దేశమట! తదనుగుణంగా ఐటీ స్లాబుల్ని మార్చడం ద్వారా భారం తగ్గించుకోవచ్చన్న ఆలోచన కూడా ఏఐసీసీలో జరుగుతోంది!

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com