పాకిస్తాన్ ఎన్నికల్లో నెగ్గిన తొలి హిందువు
- July 27, 2018
పాకిస్థాన్ జాతీయ అసెంబ్లీ ఎన్నికల్లో జనరల్ కేటగిరీలో విజయం సాధించిన తొలి హిందువుగా మహేష్ కుమార్ మలానీ చరిత్ర సృష్టించాడు. పాకిస్థాన్ పీపుల్స్ పార్టీ తరుపున సింధ్ ప్రావిన్స్ లోని థార్ పార్కర్ నియోజకవర్గం నుంచి ఆయన బరిలోకి దిగారు. ఏకంగా 14 మందిని వెనక్కు నెట్టి విజేతగా నిలిచాడు. సమీప అభ్యర్థి గ్రాండ్ డెమొక్రటికల్ అలియన్స్కు చెందిన అరబ్ జాకవుల్లాపై గెలుపొందారు. మహేష్ కుమార్ మలానీకి 1,06,630 ఓట్లు రాగా, ప్రత్యర్థికి 87,251 ఓట్లు వచ్చాయి.
మహేశ్ పాకిస్థానీ హిందూ రాజస్థానీ పుష్కర్ణ బ్రహ్మణ కుటుంబానికి చెందినవాడు. 2003-08లో పీపీపీ నుంచి పార్లమెంటు రిజర్వ్డ్ సీటుకు నామినేట్ అయ్యారు. సింధ్ అసెంబ్లీ స్టాండింగ్ కమీటి చైర్ పర్సన్ గా మలానీ సేవలందించారు. 2002 నుంచి రూపొందించిన చట్టం ప్రకారం ముస్లిం మతస్థులు కానివారు కూడా పాకిస్ధాన్ పార్లమెంట్, అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసేందుకు అవకాశం కల్పించారు. పది సీట్లను మైనార్టీల కోసం నేషనల్ అసెంబ్లీలో కేటాయించారు. పార్లమెంట్ లో ఆ పార్టీలకు ఉన్న సీట్ల సంఖ్యను బట్టి కేటాయింపు జరుగుతుంది.
తాజా వార్తలు
- తాజా సంస్కరణలతో సామాన్యులకు భారీ ఊరట
- శ్రీవారి బ్రహ్మోత్సవాలకు భారీ భద్రతా ఏర్పాట్లు
- వడ్డీ రేట్లను 25 బేసిస్ పాయింట్లు తగ్గించిన QCB..!!
- ఫోర్బ్స్ మిడిల్ ఈస్ట్ సస్టైనబిలిటీ లీడర్లలో నలుగురు కువైటీలు..!!
- పర్వతారోహణ సాధన చేస్తూ గాయపడ్డ వ్యక్తి..!!
- తవక్కల్నా యాప్ కొత్త ఇంటర్ఫేస్ ఆవిష్కరణ..!!
- ఇసా టౌన్ ప్రసిద్ధ మార్కెట్లో తనిఖీలు..!!
- రాస్ అల్ ఖైమాలో గ్యాస్ సిలిండర్ పేలుడు..!!
- ఈ నెల 30 వరకు ఏపీ అసెంబ్లీ
- రాహుల్ గాంధీ మరో బాంబు..మీడియా ముందుకు ‘సాక్ష్యాలు’..