ట్రాన్సిట్‌ వీసా పై భారత్‌లోని ఫ్రాన్స్‌ రాయబారి స్పష్టీకరణ

- July 28, 2018 , by Maagulf
ట్రాన్సిట్‌ వీసా పై భారత్‌లోని ఫ్రాన్స్‌ రాయబారి స్పష్టీకరణ

న్యూఢిల్లీ: భారతీయులు ఇకపై ఫ్రాన్స్‌లోని ఏ అంతర్జాతీయ విమానాశ్రయంలో అయినా ట్రాన్సిట్‌ వీసా లేకుండానే భారత పాస్‌పోర్టు ఉన్న వ్యక్తులు ప్రయాణించేందుకు వీలవుతుంది. ఈనెల 23వ తేదీనుంచి భారతీయ పాస్‌పోర్టు కలిగి ఉన్న అభ్యర్ధులు ఎయిర్‌ట్రాన్సిట్‌ వీసాను పొందనవసరం లేదని, ఫ్రాన్స్‌లోని ఏ అంతర్జాతీయ విమానాశ్రయానికైనా వెళ్లవచ్చని భారత్‌లోని ఫ్రాన్స్‌ రాయబారి అలెగ్జాండర్‌ జీగ్లర్‌ వెల్లడించారు. ఎయిర్‌పోర్టుట్రాన్సిట్‌ వీసా ఉంటే ప్రయాణీకులు షెంజెన్‌ ప్రాదేశిక ప్రాంతంలో పర్యటించవచ్చు. అయితే ఈ ప్రాదేశిక ప్రాంతాన్ని దాటి వెళ్లేందుకు వీలులేదు. అయితేహోటల్‌ వసతి మాత్రమే బయటినుంచి అందుబాటులో ఉంటాయి. ఈ వీసా నిర్దేశించినప్రాంతానికి మించి ఆ ప్రయాణీకుడు వెళ్లేందుకువీలులేదు. రాత్రి మొత్తం బసచేయాలంటే ప్రయాణీకులకు టూరిస్టు వీసా అవసరం అవుతుంది. ఏకీకృత షెంజెన్‌ వీసా గ్రూప్‌ కింద చూస్తే రెండురకాలుగా ట్రాన్సిట్‌ వీసాలున్నాయి. షెంజెన్‌ సభ్యదేశానికి వెళ్లేవారికి ఇచ్చే వీసా ఒకటి.

అక్కడినుంచి వారు చివరి గమ్యస్థానానికి చేరుకునేందుకు ఒకటి. ఫ్రాన్స్‌పరంగా మొతతం 26 యూరోపియన్‌ దేశాలతో కలిసిన ప్రాంతాన్ని షెంజెన్‌ ప్రాంతంగా రూపొందించింది. ఆదేశాల్లోని సరిహద్దులగుండా వెళ్లేందుకు ఎలాంటి అధికారిక పాస్‌పోర్టులు అవసరం లేదు. అలాగే ఎలాంటి వీసాలు సైతం అవసరంలేదు.

అదేవిధంగా ఇపుడు ఇతర విదేశీయులకుసైతం యూరోజోన్‌లోని నిర్దేశించినప్రాంతాలకు ఈ ట్రాన్సిట్‌ వీసా అవసరం లేకుండానే ప్రయాణించేందుకు వీలు కలుగుతున్నది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com