క్లౌడ్ అకౌంటింగ్ సాఫ్ట్‌వేర్‌లో శిక్షణ
- July 28, 2018
అమరావతిః క్లౌడ్ అకౌంటింగ్లో బీకాం, ఎంకాం, ఎంబీఏ విద్యార్థులకు శిక్షణ ఇప్పించేందుకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ సిద్ధమైంది. ఈ మేరకు జోహో, ఇన్‌స్టా ఈఎంఐ సంస్థలతో శుక్రవారం ఒప్పందం (ఎంవోయూ) కుదుర్చుకుంది. ఇందులో భాగం గా రాష్ట్రంలోని 391 ఎంప్లాయిబిలిటీ స్కిల్స్ సెంటర్లలో జోహో, ఇన్‌స్టా ఈఎంఐ సంస్థల ఆధ్వర్యంలో విద్యార్ధులకు క్లౌడ్ అకౌంటింగ్లో నైపుణ్య శిక్షణ కార్యక్రమాలు అందుబాటులోకి రానున్నాయని రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ ఇన్చార్జ్ ఎండీ వరప్రసాద్ వివరించారు. భవిష్యత్‌లో క్లౌడ్ అకౌంటింగ్ సాఫ్ట్‌వేర్‌కు మార్కెట్లో డిమాండ్ ఉంటుందని జోహో సంస్థ డైరెక్టర్ నారాయణన్ చెప్పారు. ఫైనాన్స్ రంగంలో ఉండే అవకాశాలకు అనుగుణంగా నైపుణ్యాభివృద్ధి సంస్థ ద్వారా విద్యార్థులకు స్వయం ఉపాధిలో శిక్షణను ఇస్తామని ఇన్‌స్టా ఈఎంఐ సీఈవో హనుమంతు వివరించారు.
తాజా వార్తలు
- తెలంగాణాలో వణికిస్తున్న చలి..
- మరో నాలుగు వందేభారత్ రైళ్లను ప్రారంభించిన ప్రధాని మోదీ
- శంకర నేత్రాలయ యూఎస్ఏ ఫండ్రైజర్ విజయవంతం
- ఢిల్లీ ఎయిర్‌పోర్టులో 800కి పైగా విమానాలు ఆలస్యమయ్యాయి
- మాలిలో ఐదుగురు భారతీయుల కిడ్నాప్ చేసిన గుర్తుతెలియని దుండగులు
- అమెరికా వీసా, గ్రీన్ కార్డ్ నిబంధనలు కఠినం..
- సౌదీ లో రియల్ ఎస్టేట్ కంపెనీకి SR3.7 మిలియన్ల జరిమానా..!!
- ఓన నిలవ్ 2025: గ్రాండ్ ఓనం వేడుకలు..!!
- కువైట్‌లో వందేమాతరం 150వ వార్షికోత్సవ వేడుకలు..!!
- ఫేక్ ఎమిరటైజేషన్ను అరికట్టడానికి యూఏఈలో న్యూ రూల్స్..!!







