ఆఫ్ఘనిస్థాన్‌లోని జలాలాబాద్‌లో వరుస పేలుళ్ళు...
- July 28, 2018
జలాలాబాద్:తూర్పు ఆఫ్ఘనిస్థాన్‌లోని జలాలాబాద్ పట్టణం శనివారం వరుస బాంబు పేలుళ్ళు, తుపాకీ కాల్పుల శబ్దాలతో వణికిపోయింది. స్థానిక అధికారుల కథనం ప్రకారం నర్సింగ్ శిక్షణ కేంద్రం సమీపంలో ఈ పేలుళ్ళు జరిగాయి. ఈ దుర్ఘటనలో ప్రాణ, ఆస్తి నష్టాల సమాచారం ఇంకా తెలియడం లేదు. ఈ శిక్షణ కేంద్రంలోని చాలా మంది విద్యార్థినులను సురక్షితంగా వేరొక చోటుకి తరలించినట్లు ప్రభుత్వ అధికార ప్రతినిథి అత్తావుల్లా ఖోగ్యానీ చెప్పారు. ఈ కేంద్రంలో శిక్షణ పొందుతున్నవారిలో నూరిస్తాన్ ప్రావిన్స్ ప్రాంతానికి చెందిన విద్యార్థినులు అధికంగా ఉన్నారన్నారు.
పేలుళ్ళు జరిగిన ప్రాంతమంతా దట్టమైన పొగ వ్యాపించింది. భద్రతా దళాలు, అంబులెన్సులు హుటాహుటిన సంఘటనా స్థలానికి చేరుకున్నాయి. ట్రాఫిక్‌ను క్రమబద్ధం చేసి, సహాయక చర్యలు ప్రారంభించాయి.
కొద్ది రోజులుగా జలాలాబాద్‌పై బాంబు దాడులు జరుగుతున్నాయి. పదుల సంఖ్యలో ప్రజలు ప్రాణాలు కోల్పోతున్నారు. తామే ఈ దాడులకు పాల్పడినట్లు ఇస్లామిక్ స్టేట్ ప్రకటించింది. అయితే శనివారం జరిగిన పేలుళ్ళకు తమదే బాధ్యత అని ఇప్పటి వరకు ఎవరూ ప్రకటించలేదు.
తాజా వార్తలు
- తెలంగాణ గల్ఫ్ సమితి ఆధ్వర్యంలో ఉచిత మెగా వైద్య శిబిరం విజయవంతం
- ఆ వృత్తిలోకి ఎవ్వరూ వెళ్లకండి.: పవన్ స్ట్రాంగ్ వార్నింగ్
- ఖతార్‌లో సీజనల్ ఇన్ఫ్లుఎంజా టీకాలపై క్యాంపెయిన్..!!
- బీస్ట్ ల్యాండ్ జోన్ కోసం GEA టిక్కెట్లు ప్రారంభం..!!
- దుబాయ్ ఫిట్నెస్ ఛాలెంజ్ లో యోగా స్పెషల్..!!
- బౌలేవార్డ్ క్రికెట్ గ్రౌండ్ లో "ఇండియా మేళా 2025"..!!
- శాశ్వత వైకల్యం..బాధితుడికి BD 7,000 పరిహారం..!!
- సోషల్ ప్రొటెక్షన్ ఫండ్ ఆన్ లైన్ సేవలకు అంతరాయం..!!
- తెలంగాణాలో వణికిస్తున్న చలి..
- మరో నాలుగు వందేభారత్ రైళ్లను ప్రారంభించిన ప్రధాని మోదీ







