పొట్ట ఎందుకు పెరుగుతుందంటే...
- July 29, 2018
చాలా మందికి చిన్న వయసు నుంచే పొట్ట పెరుగుతుంది. మరికొందరికి వయసు పెరిగే కొద్దీ పొట్ట పెద్దదిగా అవుతుంది. ఇలా పొట్ట ఎందుకు పెరుగుతుందో తెలియక... తిండి మానేసి డైటింగ్లు చేస్తుంటారు అనేక మంది. నిజానికి పొట్ట ఎందుకు పెరుగుతుందో ఇపుడు తెలుసుకుందాం.
సాధారణంగా పొట్ట పెద్దదిగా ఉంటే ఖచ్చితంగా విటమిన్ 'డి' లోపం ఉన్నట్టే. ఈ విషయాన్ని సైంటిస్టులు తాజాగా చేసిన పరిశోధనల్లో తేల్చారు. అధికంగా పొట్ట ఉన్నవారిలో విటమిన్ డి తక్కువగా ఉంటుందని, ఈ కారణంగానే పొట్ట పెరుగుతుందని వారు చెపుతున్నారు.
నెదర్లాండ్స్ ఎపిడెమియాలజీ ఆఫ్ ఒబెసిటీ పరిశోధకులు నిర్వహించిన ఓ అధ్యయనం ఆధారంగా చేసుకుని వీయూ యూనివర్సిటీ మెడికల్ సెంటర్, లెయిడెన్ యూనివర్సిటీ మెడికల్ సెంటర్ పరిశోధకులంతా కలిసి సంయుక్తంగా ఓ డేటాను సేకరించారు. ఆ డేటాలో ఉన్న అనేక అంశాలను వారు ప్రస్తావించారు.
45 నుంచి 65 సంవత్సరాల మధ్య వయస్సు ఉన్న మహిళలు, పురుషుల్లో పొట్ట అధికంగా ఉన్న వారిలో విటమిన్ డి లోపం ఉన్నట్లు వారు గుర్తించారు. కనుక పొట్ట అధికంగా ఉన్న వారు విటమిన్ డి టెస్టు చేయించుకుని లోపం ఉంటే మందులను వాడటం లేదా విటమిన్ డి ఉన్న ఆహారం తీసుకోవడం వల్ల ఈ సమస్య నుంచి గట్టెక్కవచ్చని సలహా ఇస్తున్నారు.
వాస్తవానికి విటమిన్ 'డి' సూర్యకాంతి ద్వారా లభిస్తుంది. ఇందుకోసం నిత్యం ఉదయాన్నే 20 నిమిషాల పాటు దేహానికి సూర్యకాంతి తగిలేలా చూసుకుంటే సరిపోతుంది. దీంతో శరీరంలో చర్మం కింద ఉండే కొవ్వులో విటమిన్ 'డి' తయారవుతుంది.
అలాగే ఎముకల పెరుగుదలకు అవసరం అయ్యే కాల్షియం స్థాయిలను కూడా విటమిన్ 'డి' నియంత్రిస్తుంది. కనుక విటమిన్ 'డి' మనకు అత్యంత ఆవశ్యకం. ఇక ఇదేకాకుండా పుట్టగొడుగులు, కాడ్ లివర్ ఆయిల్, అవకాడో, గుడ్లు, నట్స్, చేపలు, నెయ్యి, క్యారెట్స్ తదితర ఆహారాలను తరచూ తీసుకుంటుంటే విటమిన్ 'డి' లోపాన్ని అధిగమించవచ్చని సైంటిస్టులు చెపుతున్నారు.
తాజా వార్తలు
- తాజా సంస్కరణలతో సామాన్యులకు భారీ ఊరట
- శ్రీవారి బ్రహ్మోత్సవాలకు భారీ భద్రతా ఏర్పాట్లు
- వడ్డీ రేట్లను 25 బేసిస్ పాయింట్లు తగ్గించిన QCB..!!
- ఫోర్బ్స్ మిడిల్ ఈస్ట్ సస్టైనబిలిటీ లీడర్లలో నలుగురు కువైటీలు..!!
- పర్వతారోహణ సాధన చేస్తూ గాయపడ్డ వ్యక్తి..!!
- తవక్కల్నా యాప్ కొత్త ఇంటర్ఫేస్ ఆవిష్కరణ..!!
- ఇసా టౌన్ ప్రసిద్ధ మార్కెట్లో తనిఖీలు..!!
- రాస్ అల్ ఖైమాలో గ్యాస్ సిలిండర్ పేలుడు..!!
- ఈ నెల 30 వరకు ఏపీ అసెంబ్లీ
- రాహుల్ గాంధీ మరో బాంబు..మీడియా ముందుకు ‘సాక్ష్యాలు’..