హైదరాబాద్:9న ఐకియా ఫర్నీచర్‌ కంపెనీకి వ్యతిరేకంగా ఆందోళనలు

- July 29, 2018 , by Maagulf
హైదరాబాద్:9న ఐకియా ఫర్నీచర్‌ కంపెనీకి వ్యతిరేకంగా ఆందోళనలు

హైదరాబాద్: ఆగస్టు 9న ఐకియా ఫర్నీచర్‌ కంపెనీకి వ్యతిరేకంగా రాష్ట్ర వ్యాప్తంగా ధర్నాలు, ర్యాలీలు, దిష్టిబొమ్మల దహనం, కలెక్టరేట్‌ ఆఫీసుల ముట్టడి వంటి కార్యక్రమాలను విశ్వకర్మలు చేపట్టాలని విశ్వకర్మ సంఘం కార్పొరేషన్‌ పాలకమండలి రాష్ట్ర అధ్యక్షుడు కాతోజు రామాచారి పిలుపునిచ్చారు. ఈ మేరకు తీర్మానం ప్రవేశపెట్టారు. విశ్వకర్మ కార్పొరేషన్‌ పాలకమండలి సాధన సంఘం తెలంగాణ రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో ఆదివారం మధ్యాహ్నం సుందరయ్య విజ్ఞానకేంద్రంలో సమావేశం జరిగింది. సమావేశంలో హైకోర్టు విశ్రాంత న్యాయమూర్తి జస్టిస్‌ బి.చంద్రకుమార్‌ మాట్లాడారు. స్వీడన్‌ దేశానికి చెందిన ఐకియా ఫర్నీచర్‌ కంపెనీ హైదరాబాద్‌లోని హైటెక్‌ సిటీలో 200 ఎకరాల విస్తీర్ణంలో ఆగస్టు 9న ప్రారంభిస్తున్నారని తెలిపారు. ఈ కంపెనీ వల్ల లక్షలాది మంది విశ్వకర్మలు వృత్తి కోల్పోయి ఉపాధి లేక రోడ్డునపడే ప్రమాదం ఉందన్నారు. ఐకియా కంపెనీని ఏర్పాటు చేస్తే అందులో 90 శాతం ఉద్యోగాలు విశ్వకర్మలకు ఇవ్వాలన్నారు. ఈ సమావేశంలో వి.వేణుగోపాల్‌ చారి, రుద్రోజు శివలింగం, నాగార్జున మధుసూదనాచారి, సాయిబాబు, ఆశయ్య తదితరులు పాల్గొన్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com