వాట్సాప్ గ్రూప్ వీడియో కాలింగ్
- July 31, 2018
ప్రముఖ ఇన్స్టంట్ మెసేజింగ్ యాప్ వాట్సాప్ ఎప్పటికప్పుడు కొత్తకొత్త ఫీచర్లు ప్రవేశపెడుతూ యూజర్లని ఆకట్టుకుంటోంది. త్వరలో గ్రూప్ కాలింగ్, వాయిస్ కాలింగ్ ఫీచర్లు అందించనున్నట్టు గతేడాది అక్టోబర్‌లోనే తెలిపింది. ఈ ఏడాది మే నెలలో వాట్సాప్ ప్రధాన సంస్థ అయిన ఫేస్బుక్ తను యాన్యువల్ ఎఫ్8 డెవలపర్ కాన్ఫరెన్స్‌లో వాట్సాప్ గ్రూప్ కాలింగ్ ఫీచర్‌ను ప్రకటించింది. ఎప్పుడెప్పుడా అని వాట్సాప్ యూజర్లంతా ఆత్రుతగా ఎదురు చూస్తున్న అద్భుత ఫీచర్లు ఇవాళ అందుబాటులోకి వచ్చాయి. వాట్సాప్ గ్రూప్ వీడియో కాలింగ్ ఫీచర్లో వాయిస్, వీడియో రెండింటికీ సపోర్ట్ చేస్తుంది. దీంతో నలుగురు వాట్సాప్ యూజర్లు లైవ్‌గా గ్రూప్ వీడియో, వాయిస్ కాలింగ్ చేసుకోవచ్చు.
ఈ కొత్త ఫీచర్ ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఐఓఎస్, ఆండ్రాయిడ్ యూజర్లందరికీ అందుబాటులోకి వచ్చినట్టు వాట్సాప్ ప్రకటించింది. వాట్సాప్ గ్రూప్ వీడియో, వాయిస్ కాలింగ్ ఫీచర్ కోసం.. ఈ యాప్ అప్డేటెడ్ వెర్షన్‌ను ఇన్స్టాల్ చేసుకోవాలి. గ్రూప్ వీడియో కాల్ చేయాలంటే, ముందు ఒక యూజర్‌తో వన్ టు వన్ వీడియో, వాయిస్ కాల్ ప్రారంభించాలి. ఆ తర్వాత పైన కుడివైపు ఉన్న యాడ్ పార్టిసిపెంట్ బటన్ నొక్కాలి. అలా ఇద్దరు యూజర్లను గ్రూప్ వీడియో/వాయిస్ కాల్కి యాడ్ చేయవచ్చు. తక్కువ నెట్వర్క్ ఉన్న పరిస్థితుల్లో కూడా ఈ కొత్త ఫీచర్ పనిచేస్తుంది. మెసేజెస్ మాదిరిగానే ఈ కాల్స్ కూడా ఎండ్-టూ-ఎండ్ ఎన్‌క్రిప్ట్ అయి ఉంటాయని వాట్సాప్ తెలియజేసింది.
తాజా వార్తలు
- ఐదో టీ20 సిరీస్.. విజేతగా భారత్
- స్త్రీ శక్తి హస్తకళా స్టోర్ ను ప్రారంభించిన నారా భువనేశ్వరి
- తెలంగాణ గల్ఫ్ సమితి ఆధ్వర్యంలో ఉచిత మెగా వైద్య శిబిరం విజయవంతం
- ఆ వృత్తిలోకి ఎవ్వరూ వెళ్లకండి.: పవన్ స్ట్రాంగ్ వార్నింగ్
- ఖతార్‌లో సీజనల్ ఇన్ఫ్లుఎంజా టీకాలపై క్యాంపెయిన్..!!
- బీస్ట్ ల్యాండ్ జోన్ కోసం GEA టిక్కెట్లు ప్రారంభం..!!
- దుబాయ్ ఫిట్నెస్ ఛాలెంజ్ లో యోగా స్పెషల్..!!
- బౌలేవార్డ్ క్రికెట్ గ్రౌండ్ లో "ఇండియా మేళా 2025"..!!
- శాశ్వత వైకల్యం..బాధితుడికి BD 7,000 పరిహారం..!!
- సోషల్ ప్రొటెక్షన్ ఫండ్ ఆన్ లైన్ సేవలకు అంతరాయం..!!







