ఒమన్:సహచరుడ్ని హత్య చేసిన వలసదారుడు
- July 31, 2018
మస్కట్: ఒమన్‌లోని ఓ ఫామ్‌లో ఓ వలసదారుడు, తన సహచరుడ్ని హత్య చేసినట్లు రాయల్ ఒమన్ పోలీస్ వెల్లడించడం జరిగింది. ఈ ఘటనలో నిందితుడ్ని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నిందితుడు, తన సహచరుడ్ని పలుమార్లు కత్తితో దారుణంగా పొడిచి చంపి, ఆ తర్వాత అక్కడి నుంచి పారిపోయాడు. సోహార్‌లో ఈ ఘటన చోటు చేసుకుంది. సోహార్లోగల తరీఫ్లోని ఓ ఫామ్ హౌస్‌లో నిందితుడు, తన సహచరుడ్ని చంపేందుకు పక్కా ప్లాన్ వేసుకున్నాడనీ, దాన్ని అమలు పరిచాడనీ రాయల్ ఒమన్ పోలీస్ పేర్కొన్నారు. హత్య గురించిన సమాచారం అందుకున్న పోలీసులు రంగంలోకి దిగి, నిందితుడి కోసం వేట సాగించారు. విలాయత్ ఆఫ్ ముధా (బురైమీ గవర్నరేట్ పరిధిలో) లో నిందితుడ్ని గుర్తించి అదుపులోకి తీసుకున్నట్లు రాయల్ ఒమన్ పోలీస్ వెల్లడించారు.
తాజా వార్తలు
- ఇరాన్ డ్రోన్లను విజయవంతంగా అడ్డుకున్న బహ్రెయిన్ వాయు రక్షణ వ్యవస్థ
- బంగారం కొనవద్దని ప్రధాని మోదీ చెప్పడానికి అసలు రహస్యం ఇదే !!
- నేడు వైఎస్సార్ 17వ వర్ధంతి
- ఇరాన్ పై అమెరికా ప్రతీకార దాడులతో మళ్లీ ఉద్రిక్తతలు
- పబ్లిక్ ప్లేస్‌లలో స్మోకింగ్..అల్-ముబారకీయాలో 30 కేసులు..!!
- పర్యాటకులకు థాయ్‌లాండ్ షాక్.. 60కి పైగా దేశాలకు వీసా ఫ్రీ స్టే కుదింపు..!!
- సౌదీ అరేబియాలో 2026–27 హంటింగ్ సీజన్ ప్రారంభం..నిబంధనలు కఠినం..!!
- డొమెస్టిక్ వర్కర్ల నియామక ప్రకటనలపై ఖతార్ కార్మిక మంత్రిత్వ శాఖ హెచ్చరిక..!!
- 'ఎయిర్ వైస్ మార్షల్' ర్యాంక్ సాధించిన తొలి మహిళా ఆఫీసర్‌గా శక్తి శర్మ
- ఏసీ బస్సుల్లోనూ మహిళలకు ఫ్రీ: సీఎం చంద్రబాబు







