కారు దొంగతనం: ఇద్దరి అరెస్ట్
- August 01, 2018
మస్కట్: మస్కట్ గవర్నరేట్ పరిధిలో కార్లను దొంగిలించారంటూ ఇద్దరు వ్యక్తులపై అభియోగాలు మోపబడ్డాయి. నిందితుల్ని అరెస్ట్ చేసినట్లు రాయల్ ఒమన్ పోలీస్ వర్గాలు వెల్లడించాయి. విలాయత్ అఫ్ ఆమెరాత్లోని అల్ డోకుల్లో కారు దొంగిలిస్తుండగా ఓ వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కార్ల దొంగతనాలకు సంబంధించి పలు ఫిర్యాదులు రావడంతో, రంగంలోకి దిగిన సెర్చ్ అండ్ ఇన్వెస్టిగేషన్ టీమ్ రెడ్ హ్యాండెడ్‌గా నిందితుడ్ని అరెస్ట్ చేయడం జరిగింది. మరో ఘటన రువిలో చోటు చేసుకుంది. ఓ వ్యక్తి దొంగతనాలకు పాల్పడుతున్నట్లు గుర్తించిన పోలీసులు, అతన్ని అరెస్ట్ చేసి, దొంగతనాల కోసం వినియోగిస్తున్న కారుని స్వాధీనం చేసుకున్నారు.
తాజా వార్తలు
- 'ఎయిర్ వైస్ మార్షల్' ర్యాంక్ సాధించిన తొలి మహిళా ఆఫీసర్‌గా శక్తి శర్మ
- ఏసీ బస్సుల్లోనూ మహిళలకు ఫ్రీ: సీఎం చంద్రబాబు
- బిట్స్ పిలానీ హైదరాబాద్ క్యాంపస్ యూఏవీ ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో చోటు
- సౌదీ అరేబియాలో ఒమన్ సుల్తాన్ పర్యటన..
- హైదరాబాద్-విజయవాడ-మచిలీపట్నం NH-65 విస్తరణకు ఆమోదం
- కాశీలో ఘనంగా బోనాల పండుగ వేడుకలు
- గణేష్ ఉత్సవాల ఏర్పాట్ల పై తెలంగాణ ప్రభుత్వ సమావేశంలో పాల్గొన్న డీజీపీ సీవీ ఆనంద్
- విపత్తు బాధితుల పాలిట ప్రాణదాతగా కెప్టెన్ ప్రియ
- భారత మార్కెట్‌పై అజ్మాన్ దృష్టి.. కొత్త ట్రేడ్ ఇన్సెంటివ్ ప్రోగ్రామ్ ప్రకటన
- స్థానిక ఎన్నికల పై సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు







