ఒమన్:ఏడుగుర్ని రక్షించిన కోస్ట్‌గార్డ్
- August 01, 2018
ఒమన్:రాయల్ ఒమన్ పోలీస్ కోస్ట్‌గార్డ్, ఏడుగురు వ్యక్తుల్ని రక్షించినట్లు వెల్లడించింది. మస్కట్ మరియు నార్త్ బతినా గవర్నరేట్ పరిధిలోని పలు ప్రాంతాల నుంచి వీరిని రక్షించారు. సముద్రంలో వీరు ప్రయాణిస్తున్న బోట్లు ఆగిపోవడంతో, తీవ్ర భయాందోళనలకు గురయ్యారు బాధితులు. వారిని అత్యంత చాకచక్యంగా రక్షించినట్లు కోస్ట్‌గార్డ్ తెలిపింది. మొత్తం నలుగుర్ని మస్కట్, నార్త్ బతినా గవర్నరేట్ పరిధిలో రక్షించగా, ముసాందామ్లో ముగ్గురు ఆసియా జాతీయుల్ని రక్షించారు. ఇదిలా ఉంటే, డీజిల్‌ని స్మగుల్ చేయడానికి వినియోగిస్తున్న బోటుని విలాయత్ ఆఫ్ బార్కాలో స్వాధీనం చేసుకుంది కోస్ట్ గార్డ్. సముద్రంలో బోట్లను తిప్పేవారు అప్రమత్తంగా వుండాలనీ, బోట్ల సామర్థ్యంపై ఎప్పటికప్పుడు తనిఖీలు నిర్వహించాలని బోట్ల యజమానులకు రాయల్ ఒమన్ పోలీస్ సూచించడం జరిగింది.
తాజా వార్తలు
- సౌదీ లో రియల్ ఎస్టేట్ కంపెనీకి SR3.7 మిలియన్ల జరిమానా..!!
- ఓన నిలవ్ 2025: గ్రాండ్ ఓనం వేడుకలు..!!
- కువైట్‌లో వందేమాతరం 150వ వార్షికోత్సవ వేడుకలు..!!
- ఫేక్ ఎమిరటైజేషన్ను అరికట్టడానికి యూఏఈలో న్యూ రూల్స్..!!
- ఖతార్ విలువైన భాగస్వామి..గ్లోబల్ ఫండ్ చైర్ పర్సన్ ప్రశంసలు..!!
- జర్మన్ జాతీయుడిని రక్షించిన ఒమన్ ఎయిర్ ఫోర్స్..!!
- తిరుమలలో వైకుంఠ దర్శనం తేదీలు ఖరారు!
- అరుదైన చికిత్స చేసిన మెడికవర్ హాస్పిటల్స్
- హైదరాబాద్‌లో కొత్త అంతర్జాతీయ స్టేడియం!
- అల్ రుస్తాక్-ఇబ్రి మధ్య వాహనాల వేగ పరిమితి తగ్గింపు..!!







