వలస కార్మికులకు యూఏఈ వీసా ఆమ్నెస్టీ ప్రకటన
- August 01, 2018
దుబాయ్:యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, బుధవారం ఆమ్నెస్టీని ప్రకటించింది. వీసా లేకుండా దేశంలోకి ప్రవేశించడం, వర్క్ పెర్మిట్‌ని మించి యూఏఈలో ఓవర్ స్టేయింగ్ చేస్తుండడం వంటి వాటి ద్వారా ఇబ్బందులు ఎదుర్కొంటున్నవారికి ఈ ఆమ్నెస్టీ ఎంతో ఉపయోగకరంగా వుండనుంది. అక్టోబర్ 31 వరకు ఇలాంటివారు దేశం విడిచి వెళ్ళేందుకు ఎలాంటి జరీమానాలు విధించకుండా అవకాశం కల్పిస్తున్నారు. ఉద్యోగం కోసం ఎదురుచూస్తున్నవారికి ఆరు నెలలపాటు చెల్లుబాటయ్యే వీసాల్ని కూడా ఆమ్నెస్టీ పీరియడ్‌లో లభించనుంది. బ్లాక్ లిస్ట్‌లో వున్నవారు లేదా లీగల్ కేసులు పెండింగ్‌లో వున్నవారికి మాత్రం ఆమ్నెస్టీ లభించదు. అధికారిక లెక్కల ప్రకారం 2016 నాటికి యూఏఈ లేబర్ పోర్స్ 6.3 మిలియన్. మొత్తం జనాభా 9.1 మిలియన్లు. యూఏఈ వర్క్ ఫోర్స్‌లో మెజార్టీ వలసదారులదే. రాజస్తాన్‌కి చెందిన 54 ఏళ్ళ గిర్రాజ్ ప్రసాద్ అనే వ్యక్తి, ఆమ్నెస్టీకి సంబంధించిన ప్రాసెస్ పూర్తి చేసుకుని, స్వదేశానికి వెళ్ళేందుకు సిద్ధంగా వున్నారు. ఆ రకంగా ఆమ్నెస్టీ పొందిన తొలి వ్యక్తిగా ఆయన వార్తల్లోకెక్కారు.దుబాయ్ లోని అల్ అవీర్ ఇమ్మిగ్రేషన్ ఆఫీస్ లో అనీష్ చౌదరి(IWRC మేనేజర్-యూ.ఏ.ఈ) హెల్ప్ డెస్క్ నిర్వహించారు.
తాజా వార్తలు
- Asia Cup 2025: ఒమన్ పై భారత్ విజయం..
- టీ20 ఫార్మాట్లో 250 మ్యాచ్‌లు పూర్తి చేసుకున్న టీమిండియా
- ప్రీక్వార్టర్స్‌లో పీవీ సింధు ఓటమి...
- ఆసియా కప్: ధనాధనా బాదిన అభిషేక్, శాంసన్..
- మణిపూర్‌లో అస్సాం రైఫిల్స్‌పై దుండగుల దాడి
- ఆర్చరీ ప్రీమియర్ లీగ్‌కు బ్రాండ్ అంబాసిడర్‌గా వ్యవహరించనున్న గ్లోబల్ ఐకాన్ రామ్ చరణ్
- నవరాత్రుల సందర్భంగా ప్రత్యేక టూర్ ప్యాకేజీ: APDTC
- ప్రపంచంలో మొదటిసారి 100 ఆవిష్కర్తలతో భేటీ కానున్న జర్నలిస్టులు
- సౌదీలో కొత్త పండ్లు, కూరగాయల ప్యాకేజింగ్ నిబంధనలు..!!
- వెబ్ సమ్మిట్ ఖతార్ 2026కి విస్తృత ఏర్పాట్లు..!!