ఇరాన్‌:హస్సన్ రౌహానీ ప్రభుత్వంపై అసంతృప్తి

- August 02, 2018 , by Maagulf
ఇరాన్‌:హస్సన్ రౌహానీ ప్రభుత్వంపై అసంతృప్తి

టెహరాన్‌: అమెరికాతో పోటాపోటీగా యుద్ధానికి తలపడుతున్న ఇరాన్‌లో అధ్యక్షడు హస్సన్ రౌహానీ పై క్రమంగా వ్యతిరేకత పెరుగుతోంది. ధరల పెరుగుదల, ద్రవ్యోల్బణం, కరెన్సీ విలువ పడిపోవటం, ఆర్థిక వ్యవస్థ మందగమనంలో సాగటం వంటి అంశాలలో ఇరాన్‌లోని వివిధ పార్టీలు ఆగ్రహంతో ఉన్నాయి. ఆర్ధిక వ్యవస్థ ఛిన్నా భిన్నం అవటంపై వివరణ ఇవ్వాలని, పార్లమెంటు సభ్యులు డిమాండ్‌ చేస్తున్నారు. అందుకోసం అత్యవసరంగా పార్లమెంటును బుధవారం సమావేశం చేయాలని డిమాండ్‌ చేసారు. అందుకు స్పందించిన రౌహానీ ప్రభుత్వం బుధవారం నాడు పార్లమెంటును సమావేశం పరచుతోంది. ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి సభ్యదేశాలతో ఇరాన్‌కు కుదిరిన అణు ఒప్పందం నుండి ఇటీవల అమెరికా వైదొలిగింది. ఒప్పందాల వల్ల ఇరాన్‌ అణు కార్యక్రమాన్ని ఆపదని అందుకు దాడులే మార్గమని ఐరోపా మిత్ర దేశాలతో కలిసి గత రెండు నెలలగా ఇరాన్‌పై దాడులు చేస్తోంది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com