భాగ్యనగరంలో కాల్పుల కలకలం...

- August 02, 2018 , by Maagulf
భాగ్యనగరంలో కాల్పుల కలకలం...

హైదరాబాద్ శివారులోని శంషాబాద్‌లో కాల్పులు కలకలం సృష్టించాయి... భూ వావాదంలో ఇరువర్గాల మధ్య ఘర్షణ జరగగా... రివాల్వర్‌తో బెదిరిస్తూ గాలోకి ఓ వర్గం కాల్పులు జరిపిన ఘటన ఆలస్యంగా వెలుగు చూసింది. సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలోని శంషాబాద్ పోలీస్ స్టేషన్‌ బహదూర్‌గూడలో ఈ ఘటన చోటు చేసుకుంది. బాధితుల ఫిర్యాదు మేరకు సెక్షన్ 307 అయుధ చట్టం సెక్షన్ 27 కింద కేసు నమోదు చేసిన శంషాబాద్ రూరల్ పోలీసులు, దర్యాప్తు చేపట్టారు.

బహదూర్‌గూడ గ్రామంలోని 110 ఎకరాలో వివాధం చోటు చేసుకుంది... సోమాజిగుడాకు చెందిన మహమ్మద్ అల్తాఫ్ ఆ స్థలం దగ్గర సూపర్ వైజర్ గా పనిచేస్తున్నాడు. గత మంగళవారం సయ్యద్ రఫీ ఇషాక్ అనే వ్యక్తి మరో ఇద్దరితో కలిసి వచ్చి... తమ భూమిలోకి ఆక్రమంగా చొరబడడమే కాకుండా రివాల్వర్‌తో బెదిరిస్తూ సయ్యద్ రఫీ ఒక రౌండ్ కాల్పులు జరిపాడని శంషాబాద్ రూరల్ పోలీసులకు ఫిర్యాదు చేశారు అల్తాఫ్. కాగా, ఈ మధ్యే మహేశ్వరం మండలం తుమ్మలూరులో ఇలాంటి ఘటనే జరిగింది. వరుసగా ఇలాంటి ఘటనలు జరగడంపై ఆందోళన వ్యక్తమవుతోంది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com