రియాద్-ముంబయి జెట్ ఎయిర్‌వేస్ విమానానికి తప్పిన ప్రమాదం
- August 02, 2018
సౌదీ అరేబియాలోని రియాద్ నుంచి ముంబయికి రావాల్సిన జెట్ ఎయిర్‌వేస్ విమానానికి ఈరోజు త్రుటిలో పెద్ద ప్రమాదం తప్పింది. 149మందితో విమానం రియాద్ నుంచి టేకాఫ్ అవుతుండగా రన్‌వేపై జారింది. ఈ ఘటన అనంతరం ప్రయాణికులందరినీ సురక్షితంగా బయటకు తీసుకొచ్చారు. ఎవ్వరికీ గాయాలు కాలేదని, ప్రమాదానికి గల కారణాలపై దర్యాప్తు చేస్తున్నామని అధికారులు వెల్లడించారు. '142మంది ప్రయాణికులు, ఏడుగురు సిబ్బందితో ఆగస్టు 3న రియాద్ నుంచి ముంబయికి రావాల్సిన 9డబ్ల్యు523 విమానం టేకాఫ్ ఆగిపోయింది. రియాద్ విమానాశ్రయంలోని రన్‌వే నుంచి తిరిగి వెనక్కి వెళ్లిపోయింది. మా ప్రయాణికులు, సిబ్బంది అంతా సురక్షితంగా ఉన్నారు. అందరినీ విమానం నుంచి బయటకు తరలించాం. ఎవ్వరికీ గాయాలు కాలేదు' అని జెట్ ఎయిర్‌వేస్ ఓ ప్రకనటలో వెల్లడించింది. స్థానిక అధికారులు ఘటనపై దర్యాప్తు చేస్తున్నారని, తమ బృందం వారికి పూర్తి సహకారం అందిస్తోందని తెలిపింది.
తమకు ప్రయాణికులు, సిబ్బంది భద్రత చాలా ముఖ్యమని జెట్ ఎయిర్‌వేస్ పేర్కొంది. ప్రయాణికులకు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసే వరకు రియాద్ విమానాశ్రయంలోని టర్మినల్ భవనంలో బస ఏర్పాటు చేసినట్లు తెలిపింది.
తాజా వార్తలు
- సౌదీ లో రియల్ ఎస్టేట్ కంపెనీకి SR3.7 మిలియన్ల జరిమానా..!!
- ఓన నిలవ్ 2025: గ్రాండ్ ఓనం వేడుకలు..!!
- కువైట్లో వందేమాతరం 150వ వార్షికోత్సవ వేడుకలు..!!
- ఫేక్ ఎమిరటైజేషన్ను అరికట్టడానికి యూఏఈలో న్యూ రూల్స్..!!
- ఖతార్ విలువైన భాగస్వామి..గ్లోబల్ ఫండ్ చైర్ పర్సన్ ప్రశంసలు..!!
- జర్మన్ జాతీయుడిని రక్షించిన ఒమన్ ఎయిర్ ఫోర్స్..!!
- తిరుమలలో వైకుంఠ దర్శనం తేదీలు ఖరారు!
- అరుదైన చికిత్స చేసిన మెడికవర్ హాస్పిటల్స్
- హైదరాబాద్లో కొత్త అంతర్జాతీయ స్టేడియం!
- అల్ రుస్తాక్-ఇబ్రి మధ్య వాహనాల వేగ పరిమితి తగ్గింపు..!!







