ఆఫ్గనిస్తాన్:ప్రార్థనా స్థలంలో ఆత్మాహుతి దాడి, 20 మంది మృతి
- August 03, 2018
అప్ఘానిస్థాన్ లో తాలిబన్లు మరోసారి రక్తపాతాన్ని సృష్టించారు. ఓ ప్రార్థనా మందిరంపై ఆత్మాహుతి దాడికి పాల్పడి 20 మందిని పొట్టనపెట్టుకున్నారు. ఈ బాంబు పేలుళ్లలో మరో 40 మంది తీవ్రంగా గాయపడ్డారు. వీరిలో కొందరి పరిస్థితి విషయమంగా ఉండటంతో మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని అప్ఘాన్అధికారులు వెల్లడించారు.
అప్ఘాన్ లోని పక్టియా ప్రావిన్స్ లోని గార్డేజ్ సిటీలో ఈ పేలుళ్లు జరిగాయి. ఇవాళ శుక్రవారం కావడంతో ప్రార్థనలు చేయడానికి మసీదులకు భారీ సంఖ్యలో ప్రజలువస్తారు. దీంతో వీరిని టార్గెట్ గా చేసుకుని ఈ దాడి జరిగింది. అందరు ప్రార్థనలు చేస్తుండగా హటాత్తుగా వారి మధ్యలోకి వెళ్లిన ఓ వ్యక్తి తనను తాను పేల్చుకున్నాడు. ఈపేలుళ్లలో ఇప్పటివరకు 20 మంది చనిపోయినట్లు సమాచారం. మరో 40 మంది తీవ్రంగా గాయపడ్డారు.
ప్రస్తుతం సంఘటనా స్థలం వద్ద సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. ఈ దాడిలో గాయపడిన క్షతగాత్రుల్లో కూడా చాలామంది పరిస్థితి విషమంగా ఉన్నట్లుతెలుస్తోంది. దీంతో మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని అప్ఘాన్ అధికారులు చెబుతున్నారు. అయితే ఈ దాడికి పాల్పడినట్లు ఇప్పటివరకు ఎవరూప్రకటించలేదు.
తాజా వార్తలు
- ఐదో టీ20 సిరీస్.. విజేతగా భారత్
- స్త్రీ శక్తి హస్తకళా స్టోర్ ను ప్రారంభించిన నారా భువనేశ్వరి
- తెలంగాణ గల్ఫ్ సమితి ఆధ్వర్యంలో ఉచిత మెగా వైద్య శిబిరం విజయవంతం
- ఆ వృత్తిలోకి ఎవ్వరూ వెళ్లకండి.: పవన్ స్ట్రాంగ్ వార్నింగ్
- ఖతార్లో సీజనల్ ఇన్ఫ్లుఎంజా టీకాలపై క్యాంపెయిన్..!!
- బీస్ట్ ల్యాండ్ జోన్ కోసం GEA టిక్కెట్లు ప్రారంభం..!!
- దుబాయ్ ఫిట్నెస్ ఛాలెంజ్ లో యోగా స్పెషల్..!!
- బౌలేవార్డ్ క్రికెట్ గ్రౌండ్ లో "ఇండియా మేళా 2025"..!!
- శాశ్వత వైకల్యం..బాధితుడికి BD 7,000 పరిహారం..!!
- సోషల్ ప్రొటెక్షన్ ఫండ్ ఆన్ లైన్ సేవలకు అంతరాయం..!!







