ఫిట్నెస్ ట్రైనర్‌గా వచ్చి వివాహేతర సంబంధం
- August 03, 2018
హైదరాబాద్:వివాహేతర సంబంధం కొనసాగిస్తున్న తన భార్యతో పాటు ఆమె ప్రియుడి నుంచి తనకు, తన పిల్లలకు ప్రాణహాని ఉందని టీమ్ వన్ ఇండియా కువైట్ అధినేత బంజారాహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. పోలీసుల కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి.. ఫిలింనగర్‌లోని అపర్ణ సినార్‌వ్యాలీకి చెందిన గోపిశెట్టి శ్రీధర్ కువైట్‌లో ‘టీమ్ వన్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్’ పేరుతో కంపెనీ నిర్వహిస్తున్నాడు. అతడికి ఇద్దరు కుమార్తెలు. ఇటీవల ఆయన భార్య ఇంట్లోనే వ్యాయామం చేసుకునేందుకు బోయిని రాకేష్‌కుమార్‌యాదవ్ అనే వ్యక్తిని ఫిట్నెస్ ట్రైనర్‌గా నియమించుకుంది. రాకేష్ ప్రతిరోజూ ఉదయం రెండు గంటల పాటు వారి ఇంటికి వచ్చి వ్యాయామం చేయించేవాడు. ఇదే క్రమంలో వారి మధ్య వివాహేతర సంబంధం ఏర్పడింది.
దీనిని గుర్తించిన పనిమనుషులు, డ్రైవర్లు శ్రీధర్ దృష్టికి తీసుకొచ్చారు. శ్రీధర్ వారికి వార్నింగ్ ఇచ్చినా తీరు మార్చుకోలేదు. గత రెండు నెలలుగా అతను కువైట్‌లో ఉండగా రాకేష్ పూర్తిగా ఆయన ఇంట్లోనే ఉంటూ భార్యతో గడుపుతున్నట్లు తెలుసుకున్నాడు. రెండు రోజుల క్రితం ఇంటికి వచ్చిన శ్రీధర్ వారిని రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకుని బయటికి గెంటేశాడు. కాగా అప్పటికే వారిద్దరూ కలిసిసురాస్ అనే నిర్మాణ రంగ సంస్థను కూడా ప్రారంభించినట్లు ఆయన దృష్టికి వచ్చింది. వారి నుంచి తనకు ప్రాణహాని ఉందని బాధితుడు ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఆయన భార్యతో పాటు రాకేష్‌పై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
తాజా వార్తలు
- తెలంగాణాలో వణికిస్తున్న చలి..
- మరో నాలుగు వందేభారత్ రైళ్లను ప్రారంభించిన ప్రధాని మోదీ
- శంకర నేత్రాలయ యూఎస్ఏ ఫండ్రైజర్ విజయవంతం
- ఢిల్లీ ఎయిర్‌పోర్టులో 800కి పైగా విమానాలు ఆలస్యమయ్యాయి
- మాలిలో ఐదుగురు భారతీయుల కిడ్నాప్ చేసిన గుర్తుతెలియని దుండగులు
- అమెరికా వీసా, గ్రీన్ కార్డ్ నిబంధనలు కఠినం..
- సౌదీ లో రియల్ ఎస్టేట్ కంపెనీకి SR3.7 మిలియన్ల జరిమానా..!!
- ఓన నిలవ్ 2025: గ్రాండ్ ఓనం వేడుకలు..!!
- కువైట్‌లో వందేమాతరం 150వ వార్షికోత్సవ వేడుకలు..!!
- ఫేక్ ఎమిరటైజేషన్ను అరికట్టడానికి యూఏఈలో న్యూ రూల్స్..!!







