రష్యాలో తెలంగాణ విద్యార్థి మృతి
- August 04, 2018
యాదాద్రి భువనగిరి జిల్లాకేంద్రానికి చెందిన గుజ్జ నవీన్(22) అనే ఎంబీబీఎస్ విద్యార్థి రష్యాలో మృతి చెందాడు. భువనగిరి పట్టణంలోని ఆర్బీనగర్కు చెందిన గుజ్జు హేమలత, యాదగిరి దంపతులకు ఇద్దరు సంతానం. వీరిలో పెద్ద కుమారుడు గుజ్జ నవీన్. నవీన్ రష్యాలోని ఓరన్‌బాగ్ మెడికల్ యూనివర్సిటీలో చదువుతున్నాడు. పుట్టిన రోజు జరుపుకుందామని స్నేహితులతో కలిసి విహార యాత్రకు వెళ్లాడు. అందులో భాగంగా ఓ డ్యాం వద్ద సరదాగా ఈత కొట్టేందుకు దిగి ప్రమాదవశాత్తూ మునిగి చనిపోయాడు. ఈ విషయాన్ని తోటి స్నేహితులు, ఫోన్ ద్వారా నవీన్ తల్లిదండ్రులకు తెలియజేశారు. ఈ విషయం విని నవీన్ కుటుంబసభ్యులు శోకసంద్రంలో మునిగిపోయారు.
తాజా వార్తలు
- అరేబియా సముద్రంలోని హంప్‌బ్యాక్ వేల్స్ కు ప్రత్యేక గుర్తింపు..!
- కువైట్ ఫహాహీల్ మార్కెట్లో కుళ్లిన చేపలు ధ్వంసం..!!
- బహ్రెయిన్‌లో మైనర్లకు వేప్ విక్రయిస్తే BD1,000 జరిమానా..!!
- ఖతార్–భారత్ మధ్య ఆరో విడత రాజకీయ సంప్రదింపులు..!!
- గుల్మార్గ్లో ఎంపీ బాలశౌరి నేతృత్వంలో కమిటీ సమావేశం
- యూఏఈలో హత్య కేసుల్లో కిసాస్ మినహాయింపు పై కొత్త శిక్షలు..
- అమెజాన్‌లో రికార్డు స్థాయి అమ్మకాలు..
- CJP అధ్యక్షుడు అభిజీత్ దీప్కే అరెస్ట్
- తిరుమలలో మరోసారి బ్రహ్మోత్సవాల సందడి
- ‘RTC’ ఎన్నికల్లో EU కూటమి విజయం!







