ఎన్నికల అనంతరం సర్కారు నిర్ణయం..మేయర్‌కు సర్వాధికారాలు!

- August 04, 2018 , by Maagulf
ఎన్నికల అనంతరం సర్కారు నిర్ణయం..మేయర్‌కు సర్వాధికారాలు!

హైదరాబాద్‌: లండన్‌ లాంటి విదేశీ నగరాల తరహాలో మేయర్‌ పదవికి సర్వాధికారాలు కట్టబెట్టాలని ప్రభుత్వం యోచిస్తున్నట్లు అధికార వర్గాల్లో చర్చ సాగుతోంది. జీహెచ్‌ఎంసీ వికేంద్రీకరణపై శనివారం ఉత్తర్వు జారీ అయింది. ఈ సందర్భంగా మేయర్‌ పదవిపైనా సర్కారు త్వరలో కీలక నిర్ణయం తీసుకోనుందనే ప్రచారం మొదైలంది. 'జీహెచ్‌ఎంసీ, జలమండలి, హెచ్‌ఎండీఏ, పోలీస్‌, ఇతరత్రా ప్రభుత్వశాఖలన్నీ అంశాల వారీగా పనిచేస్తూ పలు సందర్భాల్లో పౌరులకు సమస్యలు సృష్టిస్తున్నాయనే అభిప్రాయం సర్కారు వ్యక్తం చేసింది. నగరాల్లో ఆయా శాఖలన్నింటినీ ఒకే గొడుకు కిందకు తెస్తే సమస్య ఉండదని భావిస్తున్నారు. నిర్ణయాధికారాలు, నిధుల మంజూరు తదితర కార్యనిర్వాహక అధికారాలు మేయర్‌కు కేటాయిస్తే పాలన సౌలభ్యంగా ఉంటుందని ప్రభుత్వం ఆలోచిస్తున్నట్లు చర్చ జరిగింది. సాధ్యాసాధ్యాలను పరిశీలించి రానున్న సార్వత్రిక ఎన్నికల అనంతరం నిర్ణయం తీసుకునే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. ప్రస్తుతం జీహెచ్‌ఎంసీలో కమిషనర్‌ పాత్రే కీలకం. మేయర్‌ పదవి పాలకమండలి సమావేశం నిర్వహణ, అభివృద్ధి కార్యక్రమాల ప్రతిపాదనలకే పరిమితం. నిధుల మంజూరు, ఇతర అధికారాలు లేవు. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com