స్కాట్లాండ్:వందల కోట్ల లాటరీ తగిలింది..
- August 05, 2018
స్కాట్లాండ్:ఏదైనా విలువైన వస్తువు పోయి తిరిగి దొరికితే.. వచ్చే ఆనందమే వేరు..అలాంటిదే జరిగింది స్కాట్లాండ్ లో. స్కాట్లాండ్ దంపతులైన 57 ఏళ్ల ఫ్రెడ్, 67 ఏళ్ల లెస్లీ హిగిన్స్లు ‘లైఫ్ చేంజింగ్’ లాటరీ టికెట్‌ను కొనుక్కున్నారు. దాంతో ఇటీవల ప్రకటించిన లాటరీలో తమ నంబర్ ఉందొ లేదో కనుక్కోవడానికి సదరు లాటరీ కార్యాలయానికి వెళ్లారు. అయితే అక్కడ సిబ్బంది ఈ నెంబర్ లాటరీలో లేదని సమాధానమిస్తూ.. దాన్ని చెత్త బుట్టలో పడేశారు. కానీ వారికీ ఎందుకో అనుమానం వచ్చి సరిగా చూడకుండానే ఆ లాటరీ టికెట్ చించిపడేశారనీ ఆరోపిస్తూ సహాయ కేంద్రంలో ఫిర్యాదు చేశారు. సీసీటీవీ ఫుటేజీని పరిశీలించి టికెట్ వెతికారు. అంతేకాదు టికెట్ నంబర్ ను నిశితంగా పరిశీలిస్తే డ్రాలో హిగిన్స్ నంబర్ ఉందని తేలింది. దీంతో వారి ఆనందానికి అవధుల్లేవు.. రూ.461 కోట్లు. జీవితంలో చూడనంత మొత్తాన్ని గెలుచుకోవడంతో ఆ దంపతులు ఎగిరి గంతేశారు.
తాజా వార్తలు
- 1,750 కుటుంబాలకు QR34 మిలియన్లు పంపిణీ..!!
- వారంలో రోజుల్లో 12,098 మందిపై బహిష్కరణ..!!
- ఆ మూడు ఎయిర్ లైన్సుల్లో బ్లూటూత్ ఇయర్ఫోన్లపై నిషేధం..!!
- కువైట్ ఉప ప్రధానమంత్రితో కేరళ ముఖ్యమంత్రి భేటీ..!!
- మాదకద్రవ్యాల కన్సైన్మెంట్ తో పట్టుబడ్డ ముగ్గురు ఆసియన్లు..!!
- బహ్రెయిన్ భూ విస్తీర్ణం 787.79 కి.మీ²కు విస్తరణ..!!
- డిజిటల్ బంగారం పై సెబీ హెచ్చరిక
- దుబాయ్ లో వీసా పునరుద్ధరణను ట్రాఫిక్ జరిమానాకు లింక్..!!
- 2027 అరబ్ క్రీడలకు బహ్రెయిన్ ఆతిథ్యం..!!
- అవినీతికి వ్యతిరేకం..మానవ హక్కులకు కువైట్ మద్దతు..!!







