కూలిన విమానం..ఐదుగురు మృతి
- August 05, 2018
లాస్‌ఏంజిల్స్ : కాలిఫోర్నియాలోని శాంటా అనా నగరంలో విమానం కూలిపోవడంతో ఐదుగురు మృతి చెందినట్లు అధికారులు తెలిపారు. రెండు ఇంజిన్‌లు కలిగిన విమానం కూలిపోయిన ఘటన ఆదివారం సౌత్‌కోస్ట్ ప్లాజా షాపింగ్ సెంటర్ సమీపంలో జరిగినట్లు అగ్నిమాపక అధికారులు వెల్లడించారు. సాన్ ఫ్రాన్సిస్కో కంపెనీ పేరుతో రిజిష్టరైన ఈ విమానం పార్కింగ్ స్థలంలో అత్యవసరంగా ల్యాండ్ అవుతుండగా కుప్పకూలినట్లు ఎఫ్‌ఎఎ అధికారులు ప్రకటించారు. దీంతో ఐదుగురు మృతి చెందగా, ఎంతమంది ప్రయాణికులు గాయపడ్డారన్న సమాచారం స్పష్టత లేదని అధికారులు పేర్కొన్నారు. ఈ ప్రమాదంపై విచారణకు ఆదేశించినట్లు ఫెడరల్ ఏవియేషన్ అడ్మినిస్ట్రేషన్ (ఎఫ్‌ఎఎ) అధికారులు ప్రకటించారు.
తాజా వార్తలు
- 1,750 కుటుంబాలకు QR34 మిలియన్లు పంపిణీ..!!
- వారంలో రోజుల్లో 12,098 మందిపై బహిష్కరణ..!!
- ఆ మూడు ఎయిర్ లైన్సుల్లో బ్లూటూత్ ఇయర్ఫోన్లపై నిషేధం..!!
- కువైట్ ఉప ప్రధానమంత్రితో కేరళ ముఖ్యమంత్రి భేటీ..!!
- మాదకద్రవ్యాల కన్సైన్మెంట్ తో పట్టుబడ్డ ముగ్గురు ఆసియన్లు..!!
- బహ్రెయిన్ భూ విస్తీర్ణం 787.79 కి.మీ²కు విస్తరణ..!!
- డిజిటల్ బంగారం పై సెబీ హెచ్చరిక
- దుబాయ్ లో వీసా పునరుద్ధరణను ట్రాఫిక్ జరిమానాకు లింక్..!!
- 2027 అరబ్ క్రీడలకు బహ్రెయిన్ ఆతిథ్యం..!!
- అవినీతికి వ్యతిరేకం..మానవ హక్కులకు కువైట్ మద్దతు..!!







