పొలిటికల్ టర్న్ తీసుకొని ట్విస్ట్ ఇచ్చిన బన్నీ
- August 05, 2018
నా పేరు సూర్య ఫలితం నిరాశపరచడంతో స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ ఏ సినిమా చేస్తాడని కన్ ఫ్యూజన్ ఉంది. విక్రం కుమర్ సినిమా ఉందని తెలుస్తుండగా ఆ ప్రాజెక్ట్ పై మాత్రం ఎలాంటి క్లారిటీ రాలేదు. అయితే లేటెస్ట్ గా బన్ని పొలిటికల్ టర్న్ తీసుకోబోతున్నాడని టాక్. అదేంటి బన్నికి రాజకీయాలకు సంబంధం ఏంటని షాక్ అవ్వొచ్చు.
విక్రం కుమార్ సినిమా ఓకేనా కాదా అన్నది తెలియదు కాని బన్ని మాత్రం వేరే కథలు వింటున్నాడని తెలుస్తుంది. లేటెస్ట్ గా సంతోష్ రెడ్డి చెప్పిన ఓ పొలిటికల్ కథపై బన్ని మనసు పడ్డాడట. కథ బాగా నచ్చేసిందని.. ఫుల్ నరేషన్ చెప్పిన సంతోష్ రెడ్డి బన్నిని ఇంప్రెస్ చేశాడట.
స్టార్ హీరోల పొలిటికల్ కథలు బాగా క్లిక్ అవుతున్నాయి. లీడర్, భరత్ అనే నేను తర్వాత బన్ని తాను కూడా పొలిటికల్ బ్యాక్ డ్రాప్ లో ఓ సినిమా చేయాలని ఫిక్స్ అయ్యాడట. ఈ సినిమాపై అఫిషియల్ న్యూస్ బయటకు రావాల్సి ఉంది. బన్ని చేయబోయే ఈ సినిమానే అంటున్నారు.
మెగా హీరోల్లో మంచి ఫాంలో ఉన్న అల్లు అర్జున్ నా పేరు సూర్య నిరాశపరచింది. ఇందులో మరో ట్విస్ట్ ఏంటంటే ఆర్య తర్వాత బన్ని కొత్త దర్శకుడితో చేసిన సినిమా నా పేరు సూర్యనే. మరి ఆ సినిమా ఫలితం తెలిశాక కూడా సంతోష్ రెడ్డితో బన్ని సినిమా చేస్తాడా అని ఫ్యాన్స్ కంగారు పడుతున్నారు.
తాజా వార్తలు
- సౌదీ లో రియల్ ఎస్టేట్ కంపెనీకి SR3.7 మిలియన్ల జరిమానా..!!
- ఓన నిలవ్ 2025: గ్రాండ్ ఓనం వేడుకలు..!!
- కువైట్లో వందేమాతరం 150వ వార్షికోత్సవ వేడుకలు..!!
- ఫేక్ ఎమిరటైజేషన్ను అరికట్టడానికి యూఏఈలో న్యూ రూల్స్..!!
- ఖతార్ విలువైన భాగస్వామి..గ్లోబల్ ఫండ్ చైర్ పర్సన్ ప్రశంసలు..!!
- జర్మన్ జాతీయుడిని రక్షించిన ఒమన్ ఎయిర్ ఫోర్స్..!!
- తిరుమలలో వైకుంఠ దర్శనం తేదీలు ఖరారు!
- అరుదైన చికిత్స చేసిన మెడికవర్ హాస్పిటల్స్
- హైదరాబాద్లో కొత్త అంతర్జాతీయ స్టేడియం!
- అల్ రుస్తాక్-ఇబ్రి మధ్య వాహనాల వేగ పరిమితి తగ్గింపు..!!







