ఆడపడుచులకు నితిన్ పెళ్లి కానుక ఏంటో చూడండి
- August 05, 2018
నితిన్, రాశీ ఖన్నా జంటగా సతీష్ వేగేశ్న దర్శకత్వంలో శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ పతాకంపై రూపొందిన సినిమా 'శ్రీనివాస కళ్యాణం'. దిల్ రాజు, శిరీష్, లక్ష్మణ్ నిర్మాతలు. మిక్కీ జె మేయర్ సంగీతం అందించారు. పెళ్లి విశిష్టతను తెలియజెప్పే కథాంశంతో రూపొందిన ఈ సినిమా ఆగస్టు 9న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఈ నేపథ్యంలో చిత్ర యూనిట్ ఒక ప్రత్యేక కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. శ్రావణమాసంలో జరిగే పెళ్లి జంటలకు పట్టు వస్త్రాలు బహూకరించాలని ఇవ్వాలని నిర్ణయించింది.
ప్రీరిలీజ్ వేడుకలో ఈ విషయమై దిల్ రాజు మాట్లాడుతూ... ఆగస్టు 9 మాకు సెంటిమెంట్ డేట్. బొమ్మరిల్లు తర్వాత మళ్లీ 12 ఏళ్లకు ఈ డేట్ కుదిరింది. ఆ డేట్ ఫిక్స్ అవ్వగానే సతీష్ ఓ విషయం చెప్పారు. శ్రావణమాసంలో తెలుగు రాష్ట్రాల్లో పెళ్లిళ్లు జరుగుతాయి. ఆ జంటలకు పట్టువస్త్రాలు ఇస్తే బావుంటుందని ఆరు నెలల క్రితం అన్నారు. దాన్ని ఎలా చేయాలిని వర్కౌట్ చేసుకుంటూ వచ్చాం. వారం క్రితం నిర్ణయం తీసుకున్నాం.
కళామందిర్ కళ్యాణ్‌కు ఈ విషయం చెప్పగానే మేము మీ టీమ్‌తో కొలాబరేట్ అవుతానని ముందుకు వచ్చారు. శ్రావణ మాసంలో తెలుగు రాష్ట్రాల్లో పెళ్లి జరుగుతున్న జంటలకు మా శ్రీనివాస కళ్యాణం పట్టు వస్త్రాలు ఇవ్వబోతున్నాం. పెళ్లీరీ అందరూ వస్త్రాలు కొనుక్కుంటారు. కొనుక్కోలేరని కాదు... ఆ వెంకటేశ్వర స్వామి ఆశీస్సులతో టెంపుల్ లో పూజలు చేయించి పంపించాలనేది మా ఆశ.
తెలుగు రాష్ట్రాల్లో పెళ్లి చేసుకునే జంటలు మీ వెడ్డింగ్ కార్డ్ మాకు ఫేస్ బుక్ ద్వారా పంపిస్తే మీ అందరికీ పట్టువస్త్రాలు పంపిస్తాం. కొందరికి మా టీమ్ స్వయంగా వచ్చి ఇస్తుంది. పెళ్లికి ఈ సినిమాలో ఎంతో విలువ ఇచ్చి చేస్తున్నాం. అందుకే ఈ నిర్ణయం తీసుకున్నామని దిల్ రాజు తెలిపారు.
తాజా వార్తలు
- తెలంగాణాలో వణికిస్తున్న చలి..
- మరో నాలుగు వందేభారత్ రైళ్లను ప్రారంభించిన ప్రధాని మోదీ
- శంకర నేత్రాలయ యూఎస్ఏ ఫండ్రైజర్ విజయవంతం
- ఢిల్లీ ఎయిర్‌పోర్టులో 800కి పైగా విమానాలు ఆలస్యమయ్యాయి
- మాలిలో ఐదుగురు భారతీయుల కిడ్నాప్ చేసిన గుర్తుతెలియని దుండగులు
- అమెరికా వీసా, గ్రీన్ కార్డ్ నిబంధనలు కఠినం..
- సౌదీ లో రియల్ ఎస్టేట్ కంపెనీకి SR3.7 మిలియన్ల జరిమానా..!!
- ఓన నిలవ్ 2025: గ్రాండ్ ఓనం వేడుకలు..!!
- కువైట్‌లో వందేమాతరం 150వ వార్షికోత్సవ వేడుకలు..!!
- ఫేక్ ఎమిరటైజేషన్ను అరికట్టడానికి యూఏఈలో న్యూ రూల్స్..!!







