దేశీయ విమానాలకు కంప్లయింట్ల తంటా
- August 05, 2018
దిల్లీ: దేశీయ విమానయాన సంస్థలపై కేవలం 20 నెలల సమయంలో 7,200కు పైగా ఫిర్యాదులు అందినట్లు ప్రభుత్వం వద్ద ఉన్న సమాచారం ద్వారా వెల్లడైంది. పౌర విమానయాన శాఖకు చెందిన ఎయిర్సేవ విభాగానికి 2016 డిసెంబరు నుంచి ఈ ఏడాది జులై వరకు 7,251 ఫిర్యాదులు అందినట్లు ప్రభుత్వం ఇటీవల పార్లమెంటుకు వెల్లడించింది. విమానాల ఆలస్యంపై 2,233 ఫిర్యాదులు అందాయని, టిక్కెట్ ధరలు, రీఫండ్లపై 1753, సిబ్బంది ప్రవర్తనపై 377 ఫిర్యాదులు వచ్చినట్లు సమాచారం. ఇటీవల దేశీయ విమాన ప్రయాణాలపై ఫిర్యాదులు విపరీతంగా పెరిగిపోతున్నాయి. ప్రయాణికుల పట్ల సిబ్బంది దురుసుగా ప్రవర్తించిన కేసులూ అధికంగా నమోదవుతున్నాయి. ప్రయాణికుల పట్ల మర్యాదగా ప్రవర్తించాలని విమానయాన సంస్థలు సిబ్బందికి సూచనలు ఇస్తూనే ఉన్నాయి. గత ఏడాదికి ఈ ఏడాదికి ఎయిర్ ట్రాఫిక్ కూడా బాగా పెరిగింది. ముఖ్యంగా ఈ ఏడాది జనవరి, జూన్ల మధ్య అధికంగా 6.84కోట్ల మంది విమానాల్లో ప్రయాణించారు. ప్రయాణికులు ఎక్కువగా ఉన్న సమయాల్లో బ్యాగేజీ విషయంలో ఫిర్యాదులు ఎక్కువగా అందుతున్నాయి.
ఈ ఏడాది జూన్లో అందిన ఫిర్యాదుల్లో 27.5శాతం బ్యాగులకు సంబంధించినవే అని డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ వెల్లడించింది.
తాజా వార్తలు
- సౌదీ లో రియల్ ఎస్టేట్ కంపెనీకి SR3.7 మిలియన్ల జరిమానా..!!
- ఓన నిలవ్ 2025: గ్రాండ్ ఓనం వేడుకలు..!!
- కువైట్లో వందేమాతరం 150వ వార్షికోత్సవ వేడుకలు..!!
- ఫేక్ ఎమిరటైజేషన్ను అరికట్టడానికి యూఏఈలో న్యూ రూల్స్..!!
- ఖతార్ విలువైన భాగస్వామి..గ్లోబల్ ఫండ్ చైర్ పర్సన్ ప్రశంసలు..!!
- జర్మన్ జాతీయుడిని రక్షించిన ఒమన్ ఎయిర్ ఫోర్స్..!!
- తిరుమలలో వైకుంఠ దర్శనం తేదీలు ఖరారు!
- అరుదైన చికిత్స చేసిన మెడికవర్ హాస్పిటల్స్
- హైదరాబాద్లో కొత్త అంతర్జాతీయ స్టేడియం!
- అల్ రుస్తాక్-ఇబ్రి మధ్య వాహనాల వేగ పరిమితి తగ్గింపు..!!







