హత్య కేసులో ఇద్దరు వలసదారుల అరెస్ట్‌

- August 06, 2018 , by Maagulf
హత్య కేసులో ఇద్దరు వలసదారుల అరెస్ట్‌

మస్కట్‌: ఓ వ్యక్తి హత్య కేసులో ఇద్దరు వలసదారుల్ని అరెస్ట్‌ చేసినట్లు రాయల్‌ ఒమన్‌ పోలీస్‌ వెల్లడించారు. అరెస్టయినవారు ఆసియా జాతీయులని రాయల్‌ ఒమన్‌ పోలీస్‌ పేర్కొనడం జరిగింది. ఈ ఇద్దరు వ్యక్తులు, మరో ఇద్దరిపై దాడికి దిగారు. ఈ దాడిలో ఓ వ్యక్తి మృతి చెందగా, మరో వ్యక్తి తీవ్రంగా గాయపడ్డారు. గాయపడ్డ వ్యక్తిని ఆసుపత్రికి తరలించి వైద్య చికిత్స అందిస్తున్నారు. అతని ఆరోగ్య పరిస్థితి విషమంగానే వుంది. అత్యంత కిరాతకంగా నిందితులు, ఇద్దరు వ్యక్తులపై కత్తులతో దాడులకు దిగినట్లు పోలీసులు తెలిపారు. 
 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com