బహ్రెయిన్‌లో ఇమామ్‌ దారుణ హత్య

- August 06, 2018 , by Maagulf
బహ్రెయిన్‌లో ఇమామ్‌ దారుణ హత్య

మాస్క్‌లో సీనియర్‌ ఇమామ్‌గా పనిచేస్తున్న వ్యక్తిని అతి కిరాతకంగా చంపేసిన ఘటన బహ్రెయిన్‌లో వెలుగు చూసింది. బంగ్లాదేశీ వ్యక్తులు ఈ ఘాతుకానికి పాల్పడినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. మృతుడ్ని అబ్దుల్‌జలీల్‌ హమూద్‌గా గుర్తించారు. ప్రార్థనల అనంతరం అబ్దుల్‌జలీల్‌ ఆచూకీ కన్పించకుండా పోయింది. దాంతో బంధువులు, అబ్దుల్‌ జలీల్‌ ఆచూకీ కోసైం పోలీసుల్ని సంప్రదించారు. ఈ కేసు విషయమై స్పందించిన ఇంటీరియర్‌ మినిస్ట్రీ, ఇమామ్‌ మృతదేహాన్ని ముక్కలు ముక్కలుగా చేసి, అల్‌ మజ్రా ఏరియాలోని స్క్రాప్‌ యార్డ్‌ దగ్గర దుండగులు పారేసినట్లు ప్రకటించింది. ఆసియాకి చెందిన 35 ఏళ్ళ వ్యక్తిని పోలీసులు ఈ కేసులో నిందితుడిగా భావించి అరెస్ట్‌ చేశారు. నిందితుడు మాస్క్‌లో రిసైటర్‌గా పనిచేస్తున్నాడనీ, అదే మాస్క్‌లో అబ్దుల్‌ అజీజ్‌ ఇమామ్‌గా పనిచేస్తున్నాడని తెలుస్తోంది. ఉచిత వీసాలు ట్రేడ్‌ చేస్తుండడంతో నిందితుడ్ని ఇమామ్‌ హెచ్చరించినట్లు, ఆ కారణంగానే ఈ హత్య జరిగిందనీ పోలీసులు భావిస్తున్నారు. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com