అమితాబచ్చన్ కుటుంబంలో విషాదం!
- August 06, 2018
బాలీవుడ్ సూపర్ స్టార్.. బిగ్‌బీ అమితాబ్ బచ్చన్ కుటుంబంలో విషాదం నెలకొంది. అమితాబ్ బచ్చన్ వియ్యంకుడు ఎస్కార్ట్స్ గ్రూప్ చైర్మన్ రాజన్ నందా నిన్న రాత్రి చనిపోయాడు , ఈ విషయం అమితాబ్ కు తెలిసిన వెంటనే బల్గెరియా నుండి భారత్ కు బయలుదేరాడు. నాగార్జున అతిథి పాత్ర పోషిస్తున్న బ్రహ్మాస్త్ర షూటింగ్ ప్రస్తుతం బల్గెరియా లో షూటింగ్ జరుపుకుంటోంది . ఇటీవలే నాగార్జున తన పార్ట్ షూటింగ్ కంప్లీట్ చేసుకొని ఇండియాకు తిరిగి వచ్చిన విషయం తెలిసిందే .
రాజన్ నందా, అమితాబ్ బచ్చన్ కూతురు శ్వేత బచ్చన్ నందాకు మామయ్య. రాజన్ నందా కొడుకు నికిల్ నందాను శ్వేతా పెళ్లి చేసుకున్నారు. కొన్ని రోజులుగా తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్న రాజన్ గత రాత్రి తుదిశ్వాస విడిచారు. ఎస్కార్ట్స్ గ్రూప్‌కు రాజన్ నందా చైర్మన్‌గా ఉండగా.. నికిల్ నందా మేనేజింగ్ డైరెక్టర్‌గా ఉన్నారు. రాజన్ నందా, రాజ్ కపూర్ పెద్ద కూతురు రీతు నందాను పెళ్లి చేసుకున్నారు. రాజన్ నందా, రీతు నందాలకు నికిల్, నటాషాలు పిల్లలు.
ఈ సందర్భంగా అమితాబ్ ట్వీట్ చేశారు. ''నా బంధువు రాజన్ నందా, నిఖిల్ తండ్రి, శ్వేత మామగారు ఇప్పుడే కన్నుమూశారు. ఇండియా వెళుతున్నాను'' అని బిగ్‌బీ ట్వీట్లో పేర్కొన్నారు. రాజన్ మృతి పట్ల పలువురు ప్రముఖులు సంతాపం తెలియజేస్తున్నారు. రాజన్ నందా మృతి పట్ల పలువురు ప్రముఖలు సంతాపం తెలియజేస్తున్నారు. నందా కుటుంబానికి బంధువు అయిన.. రిషి, నీతూ కపూర్ల కూతురు రిద్ధిమా కపూర్ సాహ్ని కూడా రాజన్ నందా మృతి వార్తను తన ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేశారు.
తాజా వార్తలు
- 1,750 కుటుంబాలకు QR34 మిలియన్లు పంపిణీ..!!
- వారంలో రోజుల్లో 12,098 మందిపై బహిష్కరణ..!!
- ఆ మూడు ఎయిర్ లైన్సుల్లో బ్లూటూత్ ఇయర్ఫోన్లపై నిషేధం..!!
- కువైట్ ఉప ప్రధానమంత్రితో కేరళ ముఖ్యమంత్రి భేటీ..!!
- మాదకద్రవ్యాల కన్సైన్మెంట్ తో పట్టుబడ్డ ముగ్గురు ఆసియన్లు..!!
- బహ్రెయిన్ భూ విస్తీర్ణం 787.79 కి.మీ²కు విస్తరణ..!!
- డిజిటల్ బంగారం పై సెబీ హెచ్చరిక
- దుబాయ్ లో వీసా పునరుద్ధరణను ట్రాఫిక్ జరిమానాకు లింక్..!!
- 2027 అరబ్ క్రీడలకు బహ్రెయిన్ ఆతిథ్యం..!!
- అవినీతికి వ్యతిరేకం..మానవ హక్కులకు కువైట్ మద్దతు..!!







