కరుణానిధి అంత్యక్రియలపై తొలగిన అడ్డంకి
- August 07, 2018
కరుణానిధి అంత్యక్రియలపై నెలకొన్న ప్రతిష్టంభన తొలగింది. మెరీనా తీరంలో ఖననం చేసేందుకు ప్రభుత్వ అనుమతి అవసరం లేదని మద్రాసు హైకోర్టు తెలిపింది. డీఎంకే స్థాపకుడు అన్నాదురై సమాధి దగ్గరే కరుణానిధిని ఖననం చేసేందుకు అనుమతించాల్సిందిగా స్టాలిన్ ప్రభుత్వాన్ని కోరారు. దీంతో న్యాయపరమైన చిక్కులు వస్తాయని ప్రభుత్వం మెరినాతీరంలో అనుమతి ఇవ్వలేదు. కరుణానిధికి స్థలం కేటాయించడానికి తీర ప్రాంత నియంత్రణ మండలి నిబంధనలు అడ్డుగా ఉన్నాయని ప్రభుత్వం స్పష్టం చేసింది. దీనికి ప్రత్యామ్నాయంగానే కరుణానిధి అంతిమ సంస్కారాలకు గిండిలో 2ఎకరాలను కేటాయించినట్లు వెల్లడించింది. డీఎంకే పార్టీ మద్రాసు హైకోర్టులో అత్యవసర పిటిషన్ను దాఖలు చేసింది. ఉదయం విచారణ సందర్భంగా ప్రభుత్వం, డీఎంకే తరపున న్యాయవాదులు వాదప్రతివాదనలు వినిపించారు. తీరప్రాంత నిబంధనల వల్లే బీచ్లో స్థలం కేటాయించలేకపోతున్నామని అంతేకాకుండా సీఎం పదవిలో ఉండగా చనిపోతేనే మెరీనా బీచ్లో స్థలం కేటాయిస్తారని ప్రభుత్వం తెలిపింది. అన్ని పక్షాల వాదనలు విన్న మద్రాసు హైకోర్టు మెరీనా తీరంలో ఖననం చేసేందుకు ప్రభుత్వ అనుమతి అవసరం లేదని తెల్చి చెప్పింది. దీంతో కరుణానిధి అంత్యక్రియలపై అడ్డంకి తొలగినైట్లెంది.
తాజా వార్తలు
- తెలంగాణాలో వణికిస్తున్న చలి..
- మరో నాలుగు వందేభారత్ రైళ్లను ప్రారంభించిన ప్రధాని మోదీ
- శంకర నేత్రాలయ యూఎస్ఏ ఫండ్రైజర్ విజయవంతం
- ఢిల్లీ ఎయిర్పోర్టులో 800కి పైగా విమానాలు ఆలస్యమయ్యాయి
- మాలిలో ఐదుగురు భారతీయుల కిడ్నాప్ చేసిన గుర్తుతెలియని దుండగులు
- అమెరికా వీసా, గ్రీన్ కార్డ్ నిబంధనలు కఠినం..
- సౌదీ లో రియల్ ఎస్టేట్ కంపెనీకి SR3.7 మిలియన్ల జరిమానా..!!
- ఓన నిలవ్ 2025: గ్రాండ్ ఓనం వేడుకలు..!!
- కువైట్లో వందేమాతరం 150వ వార్షికోత్సవ వేడుకలు..!!
- ఫేక్ ఎమిరటైజేషన్ను అరికట్టడానికి యూఏఈలో న్యూ రూల్స్..!!







