దుబాయ్:మానవత్వాన్ని చాటిన 'ETCA'

- August 09, 2018 , by Maagulf
దుబాయ్:మానవత్వాన్ని చాటిన 'ETCA'

దుబాయ్:అక్రమ నిర్వాసితుడిగా ఉంటూ, దుబాయ్ లోని నివాసం ఉంటున్న ప్రదేశంలో  ప్రమాదవశాత్తు పై అంతస్థు నుండి పడి ఆగష్టు 02 వ తేదీన మరణించిన  భూమయ్య మృతదేహాన్ని స్వదేశానికి పంపడానికి కృషి చేసి అండగా నిలిచిన  ఎమిరేట్స్ తెలంగాణ సాంస్కృతిక మరియు సంక్షేమ సంఘం (ETCA).


భూమయ్య మృతదేహం తరలింపు ప్రక్రియకు సంబందించిన పత్రాలను సమకూర్చి వేగవంతమయ్యేలా   కృషి చేసిన ETCA జెనరల్ సెక్రటరీ  నరేష్ కుమార్ మాన్యం, మృతుడి గ్రామస్థుడు సరికెల్ల మహేష్లను మరియు బాధిత కుటుంబానికి  అండగా నిలిచిన మోహనరావు పేట తోటి గ్రామస్థులను  అభినందించిన సంఘ  అద్యక్ష్యులు సత్యం రాధారపు  మరియు  వ్యవస్థాపకులు కిరణ్ కుమార్ పీచర.మృతదేహం తరలింపు ప్రక్రియకు కావలసిన మొత్తాన్ని 5,000/-  ధర్మస్  (రిఫండబుల్ ఫండ్) సమకూర్చి  సహకరించిన  ETCA అధ్యక్ష్యుడు రాధారపు సత్యం మానవత దృక్పధం తో బాధితుడి పిల్లల సంక్షేమానికై 50,000/-  రూపాయలను ఆర్ధిక సహాయంగా ప్రకటించిన ETCA. 

వివరాలు :
ఆసరి భూమయ్య (43) గ్రా: మోహన్ రావు పేట మ: కోరుట్ల, జి: జగిత్యాల   బ్రతుకు దెరువు కోసం తొమ్మిది సంవత్సరాల క్రితం యూఏఈ  వచ్చి ఏడు సంవత్సరాల నుండి స్వదేశానికి వెళ్లకుండా  అక్రమ నివాసితుడిగా జీవనం సాగిస్తున్నాడు , గత ఏడాది కాలం నుండి  పని లేకుండా గ్రామస్థులతో సైతం సంబంధం లేకుండా దుబాయ్ లో అక్కడ ఇక్కడ నివసిస్తూ కాలం వెళ్లదీస్తున్నాడు , ప్రమాదవశాత్తు ఆగష్టు 02 తేదీ నాడు నివసిస్తున్న భవనం పైనుండి పడి మరణించాడు , వెంటనే విషయాన్ని ETCA దృష్టికి తీసుక రాగ  సభ్యులు నరేష్ మాన్యం మరియు మృతుడి గ్రామానికి చెందిన మహేష్ ,శేఖర్ గౌడ్ తో కోఆర్డినేట్ చేస్తూ మహేష్ ద్వార కావాల్సిన పత్రాలను సమకూర్చి ప్రక్రియను వేగవంతంగా పూర్తి చేయడం జరిగింది .  భూమయ్య భార్య మరియు ఒక కూతురు మరణించడడం జరిగింది , భూమయ్యకు 19 సంవత్సరాల కుమారుడు మరియు 14 సంవత్సరాల కూతురు ఉన్నారు. 

ETCA సంఘ సభ్యులు రాధారపు సత్యం 10,000/- , నిస్సార్ మొహమ్మద్ 5,500/- , కిరణ్ కుమార్ పీచర 5,000/-,   వి ఎస్ ప్రవీణ్ కుమార్ 5,000/-, వంశీ కృష్ణ పుప్పాల 5000/-, సాయిచందర్ కట్కమ్ 5,000/- గుండవేని శేఖర్ 3,500/-, జగదీశ్ రావు 3,000/-,  రాజ శేఖర్ తోట 2,000/-, ముక్కెర శ్రీనివాస్ 2,000/-, శ్రీనివాస్ 2,000/-, కోతుకపు శివ 2,000/-  సహకారంతో మరణించిన భూమయ్య పిల్లల సంక్షేమం కోసం   50,000/- రూపాయలను ఆర్ధిక సహాయాన్ని ప్రకటించారు . 

ETCA ప్రతినిధి బృందం సోనాపూర్ లోని మెడికల్ సెంటరులోని మార్చురీలో భూమయ్య మృతదేహాన్ని సందర్శించి  భూమయ్య  కుటుంబానికి ప్రగాఢ సానుభూతిని తెలియచేసారు.  

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com