దసరా కానుకగా 'వేర్ ఈజ్ ద వెంకటలక్ష్మి'
- August 10, 2018
తెలుగు,తమిళ, మలయాళ కన్నడ ఇండస్ట్రీలో మంచి క్రేజ్ సంపాదించుకుంది రాయ్ లక్ష్మి. అయితే తెలుగు లో కొన్ని చిత్రాల్లో నటించినా రాయ్‌లక్ష్మీ కి పెద్దగా గుర్తింపు రాలేదు. ఆ మద్య బాలీవుడ్ లో 'జూలి 2'చిత్రంలో నటించింది కానీ అక్కడ కూడా పెద్దగా సక్సెస్ కాలేక పోయింది. వివివినాయక్, చిరంజీవి కాంబినేషన్ లో వచ్చిన 'ఖైదీ నెంబర్ 150' చిత్రంలో 'రత్తాలు రత్తాలు' సాంగ్ లో హాట్ హాట్ గా దర్శనమిచ్చి మంచి క్రేజ్ తెచ్చుకుంది.
తెలుగు లో చాలా గ్యాప్ తీసుకున్న ఈ అమ్మడు తాజాగా 'వేర్ ఈజ్ ద వెంకటలక్ష్మి' తో మరోసారి తెలుగు ప్రేక్షకులను కనువిందు చేయబోతుంది. పూర్తి గ్రామీణ నేపథ్యంలో తెరకెక్కబోయే ఈ చిత్రంతోనే కిషోర్ కుమార్ దర్శకుడిగా పరిచయమవుతున్నాడు. కార్తీక్, ప్రవీణ్, మధు నందన్ కీలక పాత్రధారులు. పూజిత పొన్నాడ ప్రత్యేక పాత్రలో నటించనుంది. హరి గౌర వేర్ సంగీతం అందిస్తున్నాడు.తాటవర్తి కిరణ్ ఈ చిత్రానికి కథ, స్క్రీన్ ప్లే, మాటలు అందిస్తున్నాడు.
ఈ చిత్రంలో ఎం శ్రీధర్ రెడ్డి, హెచ్ ఆనంద్ రెడ్డి, ఆర్కే రెడ్డి ఏబీటి క్రియేషన్స్ సంస్థపై సంయుక్తంగా నిర్మిస్తున్నారు. పూజిత పొన్నాడ, కార్తీక్, ప్రవీణ్, మధు నందన్ తదితరులు ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. ఈ చిత్రాన్ని దసరా సీజన్లో ఈ సినిమాను విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. రాయ్ లక్ష్మి .. వెంకటలక్ష్మిగా ఎంతవరకూ మెప్పిస్తుందో చూడాలి.
తాజా వార్తలు
- సౌదీ లో రియల్ ఎస్టేట్ కంపెనీకి SR3.7 మిలియన్ల జరిమానా..!!
- ఓన నిలవ్ 2025: గ్రాండ్ ఓనం వేడుకలు..!!
- కువైట్‌లో వందేమాతరం 150వ వార్షికోత్సవ వేడుకలు..!!
- ఫేక్ ఎమిరటైజేషన్ను అరికట్టడానికి యూఏఈలో న్యూ రూల్స్..!!
- ఖతార్ విలువైన భాగస్వామి..గ్లోబల్ ఫండ్ చైర్ పర్సన్ ప్రశంసలు..!!
- జర్మన్ జాతీయుడిని రక్షించిన ఒమన్ ఎయిర్ ఫోర్స్..!!
- తిరుమలలో వైకుంఠ దర్శనం తేదీలు ఖరారు!
- అరుదైన చికిత్స చేసిన మెడికవర్ హాస్పిటల్స్
- హైదరాబాద్‌లో కొత్త అంతర్జాతీయ స్టేడియం!
- అల్ రుస్తాక్-ఇబ్రి మధ్య వాహనాల వేగ పరిమితి తగ్గింపు..!!







