విధి

తాను కురిసి 
మట్టిని తడిపేయాలని 
మబ్బుకు మాత్రం ఆశ లేదంటావా 
నాలాగే..!

మతిలేని గాలి 
గతి తప్పి తరుముతుంటే 
జాలిగుండెల మబ్బు  జారిపోయింది 
మట్టిని విడిచి  వెళ్ళిపోయింది
నాలాగే..!
 
కాలం అనుకూలమే 
సఖీ , విధి బలీయమైనది

పారువెల్ల
 

Back to Top