ఏఐసీసీ అధ్యక్షుడి హోదాలో తొలిసారి తెలంగాణకు రాహుల్ గాంధీ
- August 10, 2018
ఏఐసీసీ అధ్యక్ష హోదాలో తొలిసారి తెలంగాణకు రాబోతున్నారు రాహుల్ గాంధీ. ఈనెల 13, 14 తేదిలలో రాహుల్ రంగారెడ్డి, హైదరాబాద్‌లో పర్యటిస్తారు. రెండు రోజులపాటు రాహుల్ టూర్ సదస్సులు, సమావేశాలు, బహిరంగ సభలతో బీజీ బీజీగా సాగనుంది. అధినేత పర్యటనను ప్రతిష్టాత్మకంగా తీసుకున్న కాంగ్రెస్ పార్టీ.. దాన్ని సక్సెస్ చేయాలని ఉవ్విళ్లూరుతోంది.
13వ తేది రెండున్నరకు శంషాబాద్ విమనాశ్రయంలో దిగిన వెంటనే రాహుల్ నేరుగా శంషాబాద్‌లోని క్లాసిక్ కన్వెన్షన్‌లో ఏర్పాటు చేసిన సెల్ఫ్ హెల్ప్ గ్రూప్ మహిళల మీటింగ్‌లో పాల్గొంటారు. ఈ సమావేశంలో మహిళల పట్ల కేసీఆర్, మోడీ ప్రభుత్వాలు వ్యవహరిస్తున్న తీరును అడిగి తెలుసుకుంటారు. అంతేకాకుండా తాము గతంలో మహిళలకు ఇచ్చిన ప్రాధాన్యతతో పాటు.. తాము అధికారంలోకి వస్తే.. కొత్తగా తెచ్చే పథకాలను వివరిస్తారు రాహుల్.
అక్కడి నుంచి నేరుగా శేరిలింగంపల్లిలో ఏర్పాటు చేయనున్న బహిరంగ సభలో రాహుల్ పాల్గొంటారు. కేసీఆర్ పాలనలో సెటిలర్స్ అభద్రతతో ఉన్నారంటున్న కాంగ్రెస్.. రాహుల్ చేత సెటిలర్స్ కు భరోసా ఇప్పిస్తామంటోంది. ఆదేరోజు రాత్రి రాహుల్ బేగంపేట్‌లోని హరిత ప్లాజాలో బస చేస్తారు.
ఇక రెండో రోజు ఉదయం 9 గంటల నుంచి.. సాయంత్రం వరకు రాహుల్ షెడ్యూల్ బీజీగా సాగనుంది. ఉదయం పార్టీకి చెందిన 31 వేల మంది బూత్ కమిటి అధ్యక్షులతో రాహుల్ టెలికాన్ఫరెన్స్ లో మాట్లాడతారు. ఇన్ని వేల మందితో ఓకే సారి టెలికాన్ఫరెన్స్‌లో మాట్లాడటం రికార్డ్ అంటున్నారు హస్తం నేతలు. ఆ తర్వాత అన్ని మీడియా సంస్థల ఎడిటర్స్‌తో మాట్లాడతారు. ఆ తర్వాత హోటల్ తాజ్ క్రిష్ణలో యువ పారిశ్రామిక వేత్తలతో రాహుల్ సమావేశమవుతారు. అనంతరం ఎగ్జిబిషన్ గ్రౌండ్లో గోషామహల్, నాంపల్లి నియోజవకవర్గాల కార్యకర్తలతో సమావేశమవుతారు…
రాహుల్‌ను ఉస్మానియా యునివర్సిటీకి తీసుకువెళ్లాలనుకున్న కాంగ్రెస్ నేతల ఆశలపై వీసీ నిళ్లు చల్లారు. శాంతిభద్రతల కారణంగా రాహుల్ విజిట్‌కు అనుమతిని నిరాకరించడంతో.. కాంగ్రెస్ ఆగ్రహంతో ఊగిపోతోంది. అయితే దీన్ని బ్యాలన్స్ చేసేందుకు కాంగ్రెస్ రాహుల్ షెడ్యూల్లో స్వల్ప మార్పులు చేసింది. మధ్యాహ్నం గన్ పార్క్‌లో రాహుల్ అమరవీరులకు నివాళులు అర్పిస్తారు. అనంతరం సాయంత్రం నాలుగు గంటలకు సరూర్‌నగర్ ఇండోర్ స్టేడియంలో ఏర్పాటు చేసిన విద్యార్థి -నిరుద్యోగ గర్జనలో రాహుల్ పాల్గొంటారు..
మొత్తానికి రాహుల్ రెండ్రోజుల పర్యటనలో సెటిలర్స్, మహిళలు, ముస్లింలు, విద్యార్థులకు మరింత దగ్గరవ్వడంతో పాటు.. పార్టీలో కొత్త జోష్ తీసుకురావాలని ఆశపడుతున్నారు హస్తం పార్టీ నేతలు. అయితే రాహుల్ టూర్‌ను అడ్డుకుంటామని టీఆర్ఎస్ అనుబంధ సంఘాలు ప్రకటించడం టెన్షన్ రేపుతోంది…
తాజా వార్తలు
- ఖతార్‌లో సీజనల్ ఇన్ఫ్లుఎంజా టీకాలపై క్యాంపెయిన్..!!
- బీస్ట్ ల్యాండ్ జోన్ కోసం GEA టిక్కెట్లు ప్రారంభం..!!
- దుబాయ్ ఫిట్నెస్ ఛాలెంజ్ లో యోగా స్పెషల్..!!
- బౌలేవార్డ్ క్రికెట్ గ్రౌండ్ లో "ఇండియా మేళా 2025"..!!
- శాశ్వత వైకల్యం..బాధితుడికి BD 7,000 పరిహారం..!!
- సోషల్ ప్రొటెక్షన్ ఫండ్ ఆన్ లైన్ సేవలకు అంతరాయం..!!
- తెలంగాణాలో వణికిస్తున్న చలి..
- మరో నాలుగు వందేభారత్ రైళ్లను ప్రారంభించిన ప్రధాని మోదీ
- శంకర నేత్రాలయ యూఎస్ఏ ఫండ్రైజర్ విజయవంతం
- ఢిల్లీ ఎయిర్‌పోర్టులో 800కి పైగా విమానాలు ఆలస్యమయ్యాయి







