హైదరాబాద్ విమానాశ్రయం విస్తరణ...
- August 10, 2018
హైదరాబాద్:హైదరాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయం విస్తరణ పనులను ఎల్ అండ్ టీ, మెగావైడ్ కార్పోరేషన్ సంస్థలు చేజిక్కించుకున్నాయి. జీఎంఆర్ ఇన్ఫ్రా అనుబంధ సంస్థ అయిన జీఎంఆర్ హైదరాబాద్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ (జీఎంఆర్-హెచ్ఐఏఎల్) ఈ విషయాన్ని శుక్రవారం స్టాక్ ఎక్స్జేంజీలకు వెల్లడించింది. హైదరాబాద్‌లో రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయాన్ని నిర్వహిస్తున్న జీఎంఆర్-హెచ్ఐఏఎల్ సంస్థ విమానాశ్రయ టెర్మిన ల్ బిల్డింగ్‌ను, ఎయిర్‌సైడ్ ఇన్ఫ్రా అనుబంధ మౌలిక వసతులను అభివృద్ధి పరచాలని నిర్ణయించి అంతర్జాతీయ సంస్థల నుంచి బిడ్లను ఆహ్వానించింది. ఏడాదికి 3.4 కోట్ల మంది ప్రయాణికుల అవసరాలకు తగ్గట్టుగా ఈ విస్తరణ పనులను చేపట్టాలని జీఎంఆర్ నిర్ణయించింది. టెర్మినల్ బిల్డింగ్ నిర్మాణం, ఎయిరసైడ్ ఇన్ఫ్రాకు సంబంధించి నిర్వహించిన బిడ్డింగ్ ప్రక్రియలో ఎల్1గా నిలిచిన ఎల్ అండ్ టీ సంస్థకు రూ.3,028 కోట్ల విలువైన పనులను, మెగావైడ్ కన్స్ట్రక్షన్ కార్పొరేషన్‌కు రూ.980 కోట్ల విలువైన పనులను అప్పగిస్తూ లెటర్ ఆఫ్ అవార్డును జారీ చేసినట్టుగా జీఎంఆర్-హెచ్ఐఏఎల్ తెలిపింది. ఈ విమానాశ్రయ విస్తరణ పనులు అవార్డయిన 42 నెలలో పూర్తి కానున్నట్టుఆ జీఎంఆర్ తెలిపింది.
తాజా వార్తలు
- ఐదో టీ20 సిరీస్.. విజేతగా భారత్
- స్త్రీ శక్తి హస్తకళా స్టోర్ ను ప్రారంభించిన నారా భువనేశ్వరి
- తెలంగాణ గల్ఫ్ సమితి ఆధ్వర్యంలో ఉచిత మెగా వైద్య శిబిరం విజయవంతం
- ఆ వృత్తిలోకి ఎవ్వరూ వెళ్లకండి.: పవన్ స్ట్రాంగ్ వార్నింగ్
- ఖతార్‌లో సీజనల్ ఇన్ఫ్లుఎంజా టీకాలపై క్యాంపెయిన్..!!
- బీస్ట్ ల్యాండ్ జోన్ కోసం GEA టిక్కెట్లు ప్రారంభం..!!
- దుబాయ్ ఫిట్నెస్ ఛాలెంజ్ లో యోగా స్పెషల్..!!
- బౌలేవార్డ్ క్రికెట్ గ్రౌండ్ లో "ఇండియా మేళా 2025"..!!
- శాశ్వత వైకల్యం..బాధితుడికి BD 7,000 పరిహారం..!!
- సోషల్ ప్రొటెక్షన్ ఫండ్ ఆన్ లైన్ సేవలకు అంతరాయం..!!







