అర్జెంటీనాలో మిన్నంటిన ఆందోళనలు
- August 10, 2018
బ్యూనస్ ఎయిర్స్:అర్జెంటీనాలో 14 వారాల లోపు గర్భస్రావానికి చట్టబద్ధత కల్పించే బిల్లును అర్జెంటీనా సెనేట్ బుధవారం తిరస్కరించింది. కేథలిక్ చర్చి ఒత్తిడి మూలంగానే సెనేట్ దీనిని తిరస్కరించిందని మహిళా ఉద్యమ కార్యకర్తలు ఆరోపించారు. గర్భధారణ జరిగిన 14 వారాలల్లో గర్భస్రావాలకు చట్టబద్ధత కల్పించాలంటూ ప్రవేశపెట్టిన బిల్లుపై అర్జెంటీనా సెనేట్‌లో దాదాపు 15 గంటలకు పైగా సుదీర్ఘ చర్చ జరిగింది. అనంతరం జరిగిన ఓటింగ్‌లో 31 మంది అనుకూలంగా, 38 మంది వ్యతిరేకంగా ఓటు వేయటంతో బిల్లు వీగిపోయింది. బిల్లుకు గట్టి ప్రజా మద్దతు వున్నట్లు తాజా ఒపీనియన్ పోల్స్ చెబుతున్నాయి.
కేథలిక్ చర్చి వత్తిడితోనే అర్జెంటీనా సెనేట్ ఈ బిల్లును తిరస్కరించిందని క్లారిన్ పత్రిక పేర్కొంది. పోప్ ఫ్రాన్సిస్ అర్జెంటీనాకు చెందినవాడు కావడం, ఆయన స్వయంగా అర్జెంటీనా శాసనకర్తలపై ఒత్తిడి తెచ్చిన ఫలితంగానే సెనేట్‌లో ఇది తిరస్కారానికి గురైందని ఆ పత్రిక కథనం. చాలా విషయాల్లో ప్రగతిశీల భావాలు కలిగిన పోప్ ఫ్రాన్సిస్ అబార్షన్ల విషయంలో మొదటి నుంచి మొండికేసి కూర్చొన్నారని ఆ పత్రిక పేర్కొంది. మహిళా సంఘాలు కూడా ఆయన పట్ల ఇదే అభిప్రాయం కలిగివున్నాయి. 2013లో పోప్‌గా ఎన్నిక కావడానికి ముందు అర్జెంటీనా బిషప్‌గా ఆయన చాలా కాలం పనిచేవారు.
పూజారులు, బిషప్‌లు ఈ అబార్షన్ బిల్లును వ్యతిరేకిస్తున్నారు. అందరూ జీవించే హక్కును ఈ బిల్లు కాలరాస్తుందనేది చర్చి వాదన. నాజీల కాలం నాటి దుర్మార్గాలతో దీనిని వారు పోల్చారు. దీనికి మహిళా సంఘాలు తీవ్ర అభ్యంతరం తెలిపాయి.
తాజా వార్తలు
- ఖతార్లో సీజనల్ ఇన్ఫ్లుఎంజా టీకాలపై క్యాంపెయిన్..!!
- బీస్ట్ ల్యాండ్ జోన్ కోసం GEA టిక్కెట్లు ప్రారంభం..!!
- దుబాయ్ ఫిట్నెస్ ఛాలెంజ్ లో యోగా స్పెషల్..!!
- బౌలేవార్డ్ క్రికెట్ గ్రౌండ్ లో "ఇండియా మేళా 2025"..!!
- శాశ్వత వైకల్యం..బాధితుడికి BD 7,000 పరిహారం..!!
- సోషల్ ప్రొటెక్షన్ ఫండ్ ఆన్ లైన్ సేవలకు అంతరాయం..!!
- తెలంగాణాలో వణికిస్తున్న చలి..
- మరో నాలుగు వందేభారత్ రైళ్లను ప్రారంభించిన ప్రధాని మోదీ
- శంకర నేత్రాలయ యూఎస్ఏ ఫండ్రైజర్ విజయవంతం
- ఢిల్లీ ఎయిర్పోర్టులో 800కి పైగా విమానాలు ఆలస్యమయ్యాయి







