క్యాన్సర్తో కన్నుమూసిన చిన్నారికి ఘన నివాళి
- August 10, 2018
సౌదీ అరేబియా:సౌదీలో ఓ చిన్నారి క్యాన్సర్తో కన్నుమూసింది. ఆ బాలిక వైద్య చికిత్స పొందుతుండగా, ఆ సమయంలో తీసిన ఫొటోల్ని, వీడియోల్ని సోషల్ మీడియాలో షేర్ చేస్తూ వుండేది. అలా ఆమె అతి తక్కువ కాలంలోనే పాపులర్ అయ్యింది. క్యాన్సర్తో పోరాడే క్రమంలో ఆమె చూపిన తెగువను అందరూ అభినందించేవారు. దురదృష్టవవాత్తూ ఆమె ఆగస్ట్ 8న మృతి చెందింది. దాంతో అరబ్ సమాజం అంతా ఆ బాలిక మృతి పట్ల ప్రగాఢ సంతాపం వ్యక్తం చేస్తోంది. ఆమె మరణం గురించిన తెలిసిన తర్వాత, ఆ విషయం సోషల్ మీడియాలో ట్రెండింగ్ అయ్యింది. సౌదీ అరేబియా, కువైట్ సహా పలు అరబ్ దేశాల్లో ఆమె మృతికి సంతాపం తెలియజేస్తున్నారు. ఈజిప్టియన్ కమెడియన్, నటుడు మొహమ్మద్ హెనెడీ స్పందిస్తూ, సాధారణ జ్వరానికే ఓ వ్యక్తి బెడ్ మీద కదల్లేని స్థితికి వెళ్ళిపోతాడనీ, అలాంటిది నవాల్ అల్ ఘామ్డి అనే ఓ బాలిక, క్యాన్సర్ని జయించేందుకు చాలా పోరాడిందనీ, ఎప్పుడూ ఆమె మోము మీద చిరునవ్వే కన్పించేదనీ, ఆ నవ్వు ఎప్పటికీ అలాగే మనకు గుర్తుండిపోతుందనీ అన్నారు.
తాజా వార్తలు
- ఐదో టీ20 సిరీస్.. విజేతగా భారత్
- స్త్రీ శక్తి హస్తకళా స్టోర్ ను ప్రారంభించిన నారా భువనేశ్వరి
- తెలంగాణ గల్ఫ్ సమితి ఆధ్వర్యంలో ఉచిత మెగా వైద్య శిబిరం విజయవంతం
- ఆ వృత్తిలోకి ఎవ్వరూ వెళ్లకండి.: పవన్ స్ట్రాంగ్ వార్నింగ్
- ఖతార్లో సీజనల్ ఇన్ఫ్లుఎంజా టీకాలపై క్యాంపెయిన్..!!
- బీస్ట్ ల్యాండ్ జోన్ కోసం GEA టిక్కెట్లు ప్రారంభం..!!
- దుబాయ్ ఫిట్నెస్ ఛాలెంజ్ లో యోగా స్పెషల్..!!
- బౌలేవార్డ్ క్రికెట్ గ్రౌండ్ లో "ఇండియా మేళా 2025"..!!
- శాశ్వత వైకల్యం..బాధితుడికి BD 7,000 పరిహారం..!!
- సోషల్ ప్రొటెక్షన్ ఫండ్ ఆన్ లైన్ సేవలకు అంతరాయం..!!







