ఎయిర్ ఇండియా విమాన పైలెట్ల ఆందోళన...
- August 10, 2018
న్యూఢిల్లి: జూలైలో జీతాలు చెల్లించని ఉద్యోగుల నుంచి ఒత్తిడిని అధిగమించేందుకు ఎయిర్ ఇండియా ప్రత్యామ్నాయాలు మొదలుపెట్టింది.ఇందులో భాగంగా ఎయిర్ ఇండియా శుక్రవారం సిబ్బందికి నోటీసు జారీ చేసింది, ఇందులో ఆగస్టు 13 కంతా మొత్తం జీతాలు చెల్లిస్తాం అని పేర్కొంది.
జీతాలు చెల్లించనందుకు విచారం వ్యక్తం చేస్తూ ఎయిర్ ఇండియా తన సిబ్బంది నోటీసులో చెల్లింపులు చేయడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయని తెలియజేసింది. యాజమాన్యం నియంత్రణకు మించి ఉన్న పరిస్థితులు కారణంగా జూలై 2018 లో జీతాలు చెల్లించడంలో ఆలస్యం జరిగిందని ఇందుకు తాము చాల చింతిస్తున్నాం అన్నారు అయితే, వచ్చే వారం నాటికి చెల్లింపులు చేయడానికి అన్ని ప్రయత్నాలు జరుగుతున్నాయన్నారు.
ఎయిర్ ఇండియాకు 11,000 కన్నా ఎక్కువ శాశ్వత సిబ్బంది ఉన్నారు.గత మార్చి నుండి వేతనాలు నెల నెలా చెల్లించడంలో ఆలస్యం జరుగుతోంది.సాధారణంగా, ఎయిర్లైన్స్ ప్రతి నెల 30 లేదా 31వ తేదిలకంతా వేతనాలు చెల్లిస్తుంది.
ఈక్విటీలో ఇన్ఫ్యూషన్కు సప్లిమెంటరీ గ్రాంట్లుగా రూ .980 కోట్లు అందించేందుకు పార్లమెంటు ఆమోదం తెలపాలని ప్రభుత్వం కోరింది. జూలై 26 న సివిల్ ఏవియేషన్ సహాయ మంత్రి జయంత్ సిన్హా లోక్సభలో మాట్లాడుతూ, మేలో జీతాలు చెల్లించడంలో కొంత ఆలస్యం అయిందని, తదనంతరం చెల్లించినట్లు చెప్పారు.
తాజా వార్తలు
- ఐదో టీ20 సిరీస్.. విజేతగా భారత్
- స్త్రీ శక్తి హస్తకళా స్టోర్ ను ప్రారంభించిన నారా భువనేశ్వరి
- తెలంగాణ గల్ఫ్ సమితి ఆధ్వర్యంలో ఉచిత మెగా వైద్య శిబిరం విజయవంతం
- ఆ వృత్తిలోకి ఎవ్వరూ వెళ్లకండి.: పవన్ స్ట్రాంగ్ వార్నింగ్
- ఖతార్లో సీజనల్ ఇన్ఫ్లుఎంజా టీకాలపై క్యాంపెయిన్..!!
- బీస్ట్ ల్యాండ్ జోన్ కోసం GEA టిక్కెట్లు ప్రారంభం..!!
- దుబాయ్ ఫిట్నెస్ ఛాలెంజ్ లో యోగా స్పెషల్..!!
- బౌలేవార్డ్ క్రికెట్ గ్రౌండ్ లో "ఇండియా మేళా 2025"..!!
- శాశ్వత వైకల్యం..బాధితుడికి BD 7,000 పరిహారం..!!
- సోషల్ ప్రొటెక్షన్ ఫండ్ ఆన్ లైన్ సేవలకు అంతరాయం..!!







