16 రాష్ట్రాలను ముంచెత్తనున్న వర్షాలు

- August 11, 2018 , by Maagulf
16 రాష్ట్రాలను ముంచెత్తనున్న వర్షాలు

న్యూఢిల్లీ: కేరళను వణికిస్తున్నవర్షాలు మరిన్ని రాష్ట్రాలకు  విస్తరించనున్నాయి.  పశ్చిమ మధ్య అరేబియా సముద్రంలో అల్లకల్లో పరిస్థితుల  కారణంగా రానున్న రెండు రోజుల్లో 16 రాష్ట్రాల్లో భారీనుంచి అతి భారీ వర్షాలు కురవనున్నాయని జాతీయ విపత్తు నిర్వహణ సంస్థ (ఎన్‌డీఎంఏ) హెచ్చరించింది.  పశ్చిమ బెంగాల్‌  కేరళ, ఉత్తరాఖండ్, పశ్చిమ బెంగాల్ సహా 16 రాష్ట్రాల్లో భారీ వర్షాలకు భారీ వర్షాలు కురిసే అవకాశం వుందని తెలిపింది.

కేరళతోపాటు సిక్కిం, హిమాచల్ ప్రదేశ్, ఉత్తరప్రదేశ్, ఛత్తీస్‌ఘడ్‌, బీహార్, జార్ఖండ్, ఒడిషా, అరుణాచల్ ప్రదేశ్, అసోం, మేఘాలయ, తీరప్రాంత ఆంధ్రప్రదేశ్, తీరప్రాంత కర్నాటక, తమిళనాడులో భారీ వర్షాలకు అవకాశం ఉందని తెలిపింది. అలాగే ఆది సోమ వారాల్లో ఉత్తరాఖండ్‌లో అతి భారీ వర్షాలుకురనున్నాయంటూ రెడ్‌ అలర్ట్‌ జారీ చేసింది.   ఈ మేరకు శనివారం ఎన్డీఎంఏ శనివారం ఒక ప్రకటన జారీ చేసింది.  పశ్చిమ మధ్య అరేబియా సముద్రంలో  పరిస్థితి   ఉద్రిక్తంగా మారనుందనీ, ఈ ప్రాంతంలోకి ప్రవేశించకూడదని మత్స్యకారులకు నేషనల్ డిజాస్టర్ మేనేజ్మెంట్ అథారిటీ  అధికారులు సూచించారు. భారతీయ వాతావరణ విభాగం  సమాచారం మేరకు ఆగస్టు 12(ఆదివారం), ఆగష్టు 13 (సోమవారం) ఉత్తరాఖండ్‌లోని కొన్ని ప్రాంతాల్లో  అతిభారీ వర్షాలు కురవనున్నాయంటూ  అప్రతమత్తను జారీ చేసింది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com