సారీ..! ఇమ్రాన్: గవాస్కర్
- August 11, 2018
న్యూఢిల్లీ: పాకిస్తాన్ ప్రధానమంత్రిగా బాధ్యతలు చేపట్టనున్న ఇమ్రాన్ ఖాన్‌కు సునీల్ గవాస్కర్ ఫోన్ చేసి అభినందనలు తెలిపారు. ఆగస్టు 18న ఇమ్రాన్ ఖాన్ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి గవాస్కర్ కు ఆహ్వానం అందిన సంగతి తెలిసిందే. అయితే, అదే రోజు భారత్, ఇంగ్లండ్ జట్ల మధ్య జరిగే టెస్టు మ్యాచ్‌లో కామెంటరీ చేయాల్సి ఉన్నందున.. తాను ప్రమాణ స్వీకార కార్యక్రమంలో పాల్గొనలేకపోతున్నానని ఇమ్రాన్‌కు వెల్లడించినట్టు తెలిపారు. కాగా, గవాస్కర్ తో పాటు కపిల్‌దేవ్, నవజోత్‌సింగ్ సిద్ధూ కూడా ఇమ్రాన్ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి ఆహ్వానం అందుకున్నారు. ఇమ్రాన్ నాయకత్వంలో పాకిస్తాన్ జట్టు 1992లో వన్డే క్రికెట్ వరల్డ్‌కప్ గెలుచుకున్న సంగతి విదితమే. అప్పటి పాకిస్తాన్ జట్టు సభ్యులందరికీ కూడా ఇమ్రాన్ ఖాన్ ప్రమాణ స్వీకారానికి ఆహ్వానం పంపినట్టు పీటీఐ అధికార ప్రతినిధి ఫైజల్ జావెద్ తెలిపారు.
తాజా వార్తలు
- తెలంగాణాలో వణికిస్తున్న చలి..
- మరో నాలుగు వందేభారత్ రైళ్లను ప్రారంభించిన ప్రధాని మోదీ
- శంకర నేత్రాలయ యూఎస్ఏ ఫండ్రైజర్ విజయవంతం
- ఢిల్లీ ఎయిర్‌పోర్టులో 800కి పైగా విమానాలు ఆలస్యమయ్యాయి
- మాలిలో ఐదుగురు భారతీయుల కిడ్నాప్ చేసిన గుర్తుతెలియని దుండగులు
- అమెరికా వీసా, గ్రీన్ కార్డ్ నిబంధనలు కఠినం..
- సౌదీ లో రియల్ ఎస్టేట్ కంపెనీకి SR3.7 మిలియన్ల జరిమానా..!!
- ఓన నిలవ్ 2025: గ్రాండ్ ఓనం వేడుకలు..!!
- కువైట్‌లో వందేమాతరం 150వ వార్షికోత్సవ వేడుకలు..!!
- ఫేక్ ఎమిరటైజేషన్ను అరికట్టడానికి యూఏఈలో న్యూ రూల్స్..!!







