హైదరాబాద్‌లో ఇద్దరు ఐసిస్ సానుభూతిపరుల అరెస్ట్
- August 12, 2018
హైదరాబాద్: నగరంలో ఇద్దరు ఐసిస్ సానుభూతిపరులను జాతీయ దర్యాప్తు సంస్థ(ఎన్ఐఏ) అధికారులు ఆదివారం అరెస్ట్ చేశారు. బాలాపూర్‌లోని షాయిన్‌నగర్‌లో ఎన్ఐఏ అధికారులు ఇటీవల సోదాలు నిర్వహించి 20 మంది యువకులకు విచారణకు రావాల్సిందిగా నోటీసులు జారీ చేశారు. అయితే... గత నాలుగు రోజులుగా వీరిని విచారిస్తుండగా మహ్మద్ అబ్దుల్ బాసిత్, అబ్దుల్ ఖాదిర్ అనే యువకులకు ఐసిస్ తీవ్రవాద సంస్థతో సంబంధాలున్నట్లు గుర్తించి వారిని ఆదివారం అరెస్టు చేశారు. ఐసిస్ సిద్ధాంతాన్ని హైదరాబాద్‌లో కొనసాగించడానికి ఈ ఇద్దరు కీలక పాత్ర పోషించినట్లు ఎన్ఐఏ విచారణలో బయట పడింది. అంతేగాక అనేకమంది యువతను సైతం ఐసిస్‌లో చేరేలా ప్రేరేపించే విధంగా చేశారని విచారణలో తేలింది.
తాజా వార్తలు
- తెలంగాణాలో వణికిస్తున్న చలి..
- మరో నాలుగు వందేభారత్ రైళ్లను ప్రారంభించిన ప్రధాని మోదీ
- శంకర నేత్రాలయ యూఎస్ఏ ఫండ్రైజర్ విజయవంతం
- ఢిల్లీ ఎయిర్‌పోర్టులో 800కి పైగా విమానాలు ఆలస్యమయ్యాయి
- మాలిలో ఐదుగురు భారతీయుల కిడ్నాప్ చేసిన గుర్తుతెలియని దుండగులు
- అమెరికా వీసా, గ్రీన్ కార్డ్ నిబంధనలు కఠినం..
- సౌదీ లో రియల్ ఎస్టేట్ కంపెనీకి SR3.7 మిలియన్ల జరిమానా..!!
- ఓన నిలవ్ 2025: గ్రాండ్ ఓనం వేడుకలు..!!
- కువైట్‌లో వందేమాతరం 150వ వార్షికోత్సవ వేడుకలు..!!
- ఫేక్ ఎమిరటైజేషన్ను అరికట్టడానికి యూఏఈలో న్యూ రూల్స్..!!







