వెబ్ అడ్రస్‌లు ఇకపై తెలుగులో

- August 12, 2018 , by Maagulf
వెబ్ అడ్రస్‌లు ఇకపై తెలుగులో

న్యూఢిల్లీ: ఇంతవరకూ ఇంటర్‌నెట్‌లో ఏ వెబ్‌సైట్‌ చూడాలన్నా మనం ఇంగ్లీషులో టైప్ చేశాం. కానీ త్వరలో తెలుగులో కూడా వెబ్ అడ్రస్ రాయబోతున్నాం. ప్రపంచ వ్యాప్తంగా డోమెయిన్ నేమ్స్(వెబ్ అడ్రస్‌లు)ను నియంత్రించే సంస్థ ఐసిఏఎన్ఎన్( ఇంటర్‌నెట్ కార్పొరేషన్ ఫర్ ఎసైన్డ్ నేమ్స్ అండ్ నెంబర్స్) చేపడుతున్న చర్యలే ఇందుకు కారణం. ప్రస్తుతం బెంగాలీ, దేవనాగరీ, గుజరాతీ, తెలుగు, మళయాళం, వంటి 9 భాషల్లో వెబ్ అడ్రస్‌లు రాసేందుకు అవసరమైన ఆల్లోరిథమ్‌లు రూపొందిస్తున్నామని ఐసిఏఎన్ఎన్ ఇండియా డైరెక్టర్ సమీరన్ గుప్తా తెలిపారు. భారత్‌లో 'డిజిటల్ డివైడ్'ను (ఇంటర్‌నెట్ వినియోగించటం తెలిసిన, తెలియని వారి మధ్య అంతరం) తగ్గించటంలో ఇది ఎంతో ఉపయోగపడుతుందని చెప్పారు. ఈ అంశంలో నియమాలు, నిబంధనలు రూపొందించేందుకు 60 సాంకేతిక నిపుణులు, భాషావేత్తలతో కూడిన నియో-బ్రహ్మీ ప్యానెల్ కృషి చేస్తోందన్నారు. దేవనాగరీ, గుజరాతీ, కన్నడ, తెలుగు, ఒరియా, భాషల సంబంధించిన రూల్స్‌ను సూచనలు, సలహాలూ కోసం ప్రజలకు అందుబాటులో ఉంచామన్నారు. అంటే తెలుగులో వెబ్ అడ్రస్‌లు రాసే రోజు దగ్గర్లోనే ఉందన్నమాట.

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com