వెబ్ అడ్రస్‌లు ఇకపై తెలుగులో
- August 12, 2018
న్యూఢిల్లీ: ఇంతవరకూ ఇంటర్నెట్లో ఏ వెబ్సైట్ చూడాలన్నా మనం ఇంగ్లీషులో టైప్ చేశాం. కానీ త్వరలో తెలుగులో కూడా వెబ్ అడ్రస్ రాయబోతున్నాం. ప్రపంచ వ్యాప్తంగా డోమెయిన్ నేమ్స్(వెబ్ అడ్రస్‌లు)ను నియంత్రించే సంస్థ ఐసిఏఎన్ఎన్( ఇంటర్నెట్ కార్పొరేషన్ ఫర్ ఎసైన్డ్ నేమ్స్ అండ్ నెంబర్స్) చేపడుతున్న చర్యలే ఇందుకు కారణం. ప్రస్తుతం బెంగాలీ, దేవనాగరీ, గుజరాతీ, తెలుగు, మళయాళం, వంటి 9 భాషల్లో వెబ్ అడ్రస్‌లు రాసేందుకు అవసరమైన ఆల్లోరిథమ్లు రూపొందిస్తున్నామని ఐసిఏఎన్ఎన్ ఇండియా డైరెక్టర్ సమీరన్ గుప్తా తెలిపారు. భారత్‌లో 'డిజిటల్ డివైడ్'ను (ఇంటర్నెట్ వినియోగించటం తెలిసిన, తెలియని వారి మధ్య అంతరం) తగ్గించటంలో ఇది ఎంతో ఉపయోగపడుతుందని చెప్పారు. ఈ అంశంలో నియమాలు, నిబంధనలు రూపొందించేందుకు 60 సాంకేతిక నిపుణులు, భాషావేత్తలతో కూడిన నియో-బ్రహ్మీ ప్యానెల్ కృషి చేస్తోందన్నారు. దేవనాగరీ, గుజరాతీ, కన్నడ, తెలుగు, ఒరియా, భాషల సంబంధించిన రూల్స్‌ను సూచనలు, సలహాలూ కోసం ప్రజలకు అందుబాటులో ఉంచామన్నారు. అంటే తెలుగులో వెబ్ అడ్రస్‌లు రాసే రోజు దగ్గర్లోనే ఉందన్నమాట.
తాజా వార్తలు
- 1,750 కుటుంబాలకు QR34 మిలియన్లు పంపిణీ..!!
- వారంలో రోజుల్లో 12,098 మందిపై బహిష్కరణ..!!
- ఆ మూడు ఎయిర్ లైన్సుల్లో బ్లూటూత్ ఇయర్ఫోన్లపై నిషేధం..!!
- కువైట్ ఉప ప్రధానమంత్రితో కేరళ ముఖ్యమంత్రి భేటీ..!!
- మాదకద్రవ్యాల కన్సైన్మెంట్ తో పట్టుబడ్డ ముగ్గురు ఆసియన్లు..!!
- బహ్రెయిన్ భూ విస్తీర్ణం 787.79 కి.మీ²కు విస్తరణ..!!
- డిజిటల్ బంగారం పై సెబీ హెచ్చరిక
- దుబాయ్ లో వీసా పునరుద్ధరణను ట్రాఫిక్ జరిమానాకు లింక్..!!
- 2027 అరబ్ క్రీడలకు బహ్రెయిన్ ఆతిథ్యం..!!
- అవినీతికి వ్యతిరేకం..మానవ హక్కులకు కువైట్ మద్దతు..!!







