మస్కట్‌ రోడ్స్‌పై మవసలాత్‌ డెడికేటెడ్‌ బస్‌ లేన్స్‌

- August 12, 2018 , by Maagulf
మస్కట్‌ రోడ్స్‌పై మవసలాత్‌ డెడికేటెడ్‌ బస్‌ లేన్స్‌

మస్కట్‌: ఒమన్‌ పబ్లిక్‌ ట్రాన్స్‌పోర్ట్‌ కంపెనీ మవసలాట్‌, సుల్తానేట్‌లో బస్‌ లేన్స్‌ని ఏర్పాటు చేసే దిశగా ప్లానింగ్‌లో వున్నాయని తెలిపింది. ఓ ప్రయాణీకుడు చేసిన సూచనపై మవసలాట్‌ స్పందించింది. బస్‌ల కోసం ప్రత్యేకంగా లేన్స్‌ వుండాలని ఆ ప్రయాణీకుడు సూచించారు. దీనిపై స్పందించిన మవసలాట్‌, మినిస్ట్రీ ఆఫ్‌ ట్రాన్స్‌పోర్ట్‌ అండ్‌ కమ్యూనికేషన్స్‌, మస్కట్‌ మునిసిపాలిటీలకు ఈ మేరకు తమ ఆలోచన తెలియజేశామని, మవసలాట్‌ బస్‌ల కోసం ప్రత్యేక లేన్‌ ఏర్పాటు చేయడంపై వివరించామని తెలిపింది. మస్కట్‌ మునిసిపాలిటీ ఈ ప్రాజెక్ట్‌కి సంబంధించిన టెండర్‌ని సబ్‌మిట్‌ చేయడం కూడా జరిగిందనీ, త్వరలోనే ఈ ప్రాజెక్ట్‌ అమల్లోకి వస్తుందని ఆశాభావం వ్యక్తం చేసింది మవసలాట్‌. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com