ముఖ సౌందర్యానికి యోగా..
- May 09, 2015
అందానికి రోజు రోజూ ప్రాధాన్యత పెరిగిపోతోంది. కానీ అందమైన ముఖాలన్నీ వాడిన పువ్వులాగే మారిపోతున్నాయి. జీవన శైలి, కాలుష్యం, కాస్మోటిక్స్‌తో అందం మసకబారుతోంది. చిన్న వయసులోనే ముఖంపై ముడతలొస్తున్నాయి. నీడపట్టున ఉన్నా షేడ్స్ కనిపిస్తున్నాయి. కోల్పోయిన సహజ అందాన్ని కాపాడుకునేందుకు అసహజమైన కాస్మోటిక్ పద్ధతుల్లోను ఇంకొన్ని సమ్యలు. ఇలాంటి సమస్యలేవీ లేకుండా ముఖారవిందాన్ని మరలా రాబట్టుకునేందుకు ఫేస్యోగాను పరిచయం చేస్తున్నారు నిపుణులు. యోగా ట్రైనర్లే కాకుండా బ్యూటీషియన్లు కూడా ఇప్పుడీ పద్ధతిని అందం కోసం ఆరాటపడే అతివలకు నేర్పుతున్నారు. గతంలో ఫేస్‌యోగా తెలుసుకోవాలంటే ఆన్లైనే దిక్కు! ఆ ఆన్లైన్లో చూసిన ఫేస్యోగాను ఇప్పుడు నగరంలోని కొందరు ట్రైనర్లు దగ్గరుండి పాఠాలు చెబుతూ లేటెస్టు ట్రెండుకు తెరతీశారు. ఈ ఫేస్యోగాను ఎందుకు చేయాలి? ఎలా చేయాలి? చేస్తే లాభమేమిటో? చెబుతున్నారు ఫేస్‌యోగా ట్రైనర్ మెగా దినేష్. ఆధునిక జీవన శైలితో శరీరంలో రక్త ప్రసరణ తగ్గిపోతోంది. అందువల్ల బాడీ పెయిన్స్, అవయవాల్లో అనారోగ్య సమస్యలొస్తుంటాయి. వచ్చినప్పుడు వాటికి వైద్యం చేయించుకుంటారు. అలాగే ముఖ కండరాలకు కూడా రక్తం అందనప్పుడు కూడా సమస్యలొస్తాయి. మధ్య వయసులో చర్మం ముడతలు పడడం, కంటి చుట్టు నల్లటి వలయాలేర్పడడం, ఇన్ఫెక్షన్లు, మొటిమలు, కోమలత్వం తగ్గి గిడసబారిపోవడం, గ్లో తగ్గడం వంటి సమస్యలొస్తాయి. వీటికి కారణం రక్తప్రసరణ తగ్గడం. దీనివల్ల ఆ కండరాలకు అందాల్సిన ఆక్సిజన్ తగ్గుతుంది. కణాలకు పోషకాలు అందవు. అందువల్ల చర్మ కణాల్లో చనిపోయే కణాల సంఖ్యకు, పుట్టే కణాల సంఖ్యకు మధ్య వ్యత్యాసం పెరిగి చర్మం కాంతి తగ్గినట్లుగా కనిపిస్తుంది. నిర్లక్ష్యం చేస్తే షేడ్స్, వలయాలు వస్తాయి. సమస్య పెద్దదయిన తర్వాత క్రీమ్స్‌ను ఆశ్రయిస్తారు. వీటితో ఉపశమనమే కానీ పరిష్కారం కాదు. ఎందుకంటే సమస్య శరీరంలో ఉంది. రక్త ప్రసరణను మెరుగుపరుచుకోవడమే నిజమైన పరిష్కారం. అందువల్ల క్రియే (యోగా) పరిష్కారం. ఇప్పుడు ఇందుకు సంబంధించిన నిపుణులూ అందుబాటులోకి వచ్చారు. నిరుత్తేజంతో ఉన్న నరాల్లో కదలిక తెస్తేనే మళ్లీ కండరాలకు ఉత్తేజం వస్తుంది. స్కిన్ అందంగా ఉంచడానికి దోహదపడే కొలాజిన్ ప్రొటీన్ ఉత్పత్తి పెరిగి అందం మరింతగా ప్రకాశిస్తుంది. నోటిలోకి గాలిని బాగా బుగ్గలు ఉబ్బేలా తీసుకోవాలి. కొద్ది గాలిని బయటికి వదిలిన తర్వాత గాలి బయటికి పోకుండా పెదవులను గట్టిగా పట్టి ఉంచాలి. నోటిలోని గాలినంత కుడివైపు బుగ్గ వైపుకు వెళ్లేలా చేయాలి. కొద్దిసేపు ఈ స్థితిలో ఉండాలి. తర్వాత కుడి వైపు బుగ్గలోని గాలిని ఎడమవైపు బుగ్గలోకి పోయేలా చేయాలి. కొద్దిసేపటి తర్వాత కుడి బుగ్గలోకి ఈ గాలిని పంపాలి. ఇలా అనేక పర్యాయాలు ఈ పద్ధతిలో చేస్తే బుగ్గలో ఉండే కండరాలకు, లోపలి చిగుళ్లకు రక్త ప్రసరణ పెరుగుతుంది. నరాల పనితీరు మెరుగుపడుతుంది. తలను నిటారుగా ఉంచి కింది దవడను మెడకు ఆనేలా బలంగా నోరు తెరవాలి. గాలి బాగా పీల్చి వదలాలి. కొద్దిసేపు ఉంచి మళ్లీ యధాస్థితికి రావాలి. ఇది చేస్తున్నప్పుడు కండరాలపై ఒత్తిడి ఎక్కువగా ఉంటే వెంటనే ఆగిపోవాలి. మరోసారి ప్రయత్నించేప్పుడు నెమ్మదిగా చేయాలి. కనుబొమ్మలపై వేళ్లను పెట్టి (v ఆకారంలో), గట్టిగా వత్తుతూ రెండు కళ్లను దగ్గర చేస్తున్నట్లుగా రెండు వేళ్లనూ నుదురు, ముక్కు పైభాగం కలిసే దగ్గరకు తీసుకురావాలి. ఇలా మరల, మరల అనేకసార్లు చేయాలి. నోటిలో గాలిని బంధించడం వల్ల బుగ్గ కండరాలపై ఒత్తిడి పడుతుంది. ఇలా బుగ్గలను (మరీ బలంగా ఒత్తిడి పెంచుకుండా చేయాలి.) ఉంచి వేళ్లతో మెల్లగా మర్దనా చేయాలి. కంటి చివర్లో చూపుడు వేలుంచి. దానిని కనుబొమ్మకు దగ్గరగా వత్తుతూ ముఖం మధ్య భాగంవైపునకు కదల్చాలి. అక్కడి నుంచి కనురెప్పలకు పైభాగంపై వత్తుతు మళ్లీ మొదటికి తీసుకురావాలి. ఆ తర్వాత తిరిగి వ్యతిరేక దిశలో ఇలాగే వేళ్లను కదపాలి. ఈ విధంగా అనేకమార్లు చేయాలి. నల్లటి వలయాలుంటే.. కంటి చుట్టూ ఉన్న చర్మానికి రక్త సరఫరా పెరిగేలా ఫేస్ యోగా చేయాలి. ముఖభాగంలోని కండరాలన్నింటినీ ఫ్రీగా ఉంచాలి. కళ్లను పూర్తిగా (మాగ్జిమమ్)గా తెరిచేందుకు ప్రయత్నించాలి. మాగ్జిమమ్ స్థితిలో కొద్దిసేపు ఉంచాక మళ్లీ సాధారణ స్థితికి తీసుకురావాలి. కళ్లు మూసి మళ్లీ మాగ్జిమమ్‌గా కళ్లు తెరిచేందుకు ప్రయత్నించాలి. ఇలా 5 నుంచి 10 సార్లు చేయాలి. తలను పైకెత్తి (మెడ కండరాలపై ఒత్తిడి పెంచేలా) పెదవులను గట్టిగా బంధించి ముందుకు వచ్చేలా చేయాలి. ఆ తర్వాత కిస్ శబ్దం వచ్చేలా పెదవులను విడదీయాలి. ఒక విధంగా చెప్పాలంటే ఆకాశానికి ముద్దు పెడుతున్నట్లుగా ఊహించుకుంటూ చేయండి.
తాజా వార్తలు
- ఆస్కార్స్ 2026 ప్రజెంటర్‌గా ప్రియాంక చోప్రా
- పిల్లలు, కార్మికులకు భరోసా ఇవ్వండి: కువైట్ అంతర్గత మంత్రిత్వ శాఖ విజ్ఞప్తి
- ఆన్లైన్లో మిస్ లీడ్ కంటెంట్ స్ప్రెడ్.. 194 మంది అరెస్టు..!!
- ఖతార్‌లోని అల్-ఉదీద్ వైమానిక స్థావరంపై డ్రోన్ దాడి..!!
- మనామాలో హోటళ్ళు, నివాస భవనానికి నష్టం..!!
- కువైట్‌లో చిక్కుకున్న ప్రయాణీకులతో టచ్ లో ఎంబసీ..!!
- మిడిల్ ఈస్ట్, ఒమన్‌లో CBSE పరీక్షలు రద్దు..!!
- అరబ్ దేశాలపై ఇరాన్ దాడులను ఖండించిన కౌన్సిల్..!!
- యూఏఈలో పరిమితంగా కమర్షియల్ ఫ్లైట్స్ ప్రారంభం..!!
- యూఏఈలోని ఇండియన్ సిలబస్ స్కూళ్లలో ఆన్లైన్లో ఎగ్జామ్స్..!!









