ఆగష్టు 26న 'సంతోషం' అవార్డ్స్
- August 13, 2018హైదరాబాద్:ప్రతి ఏడూ ఎంతో అంగరంగ వైభవంగా జరిగే సంతోషం అవార్డు వేడుక..ఈ ఏడాది కూడా సిద్ధం అయ్యింది. తెలుగు చిత్ర సీమలో ప్రతి ఏడూ ఎన్నో వందల చిత్రాలు విడుదల అవుతాయి కానీ వాటిలో కొన్ని మాత్రమే ప్రేక్షకులను రంజిపజేస్తాయి. అలాంటి చిత్రాలకు సంతోషం అవార్డ్స్ ఇచ్చి వాటిని సత్కరించడం ఆనవాయితీ. గత 15 సంవత్సరాలుగా ఈ అవార్డులును అందిస్తున్నది సంతోషం సంస్థ. ఈ ఏడాది జరగబోయేది 16 వ అవార్డుల వేడుక కోసం అన్ని ఏర్పాట్లు పూర్తి చేస్తుంది.
ఆగష్టు 26వ తేదీన జెఆర్సీ కన్వేషన్ హల్లో ఈ అవార్డుల వేడుక ను ఫిక్స్ చేసారు. టాలీవుడ్ సినిమా రంగానికి చెందిన అతిరధ మహారధులంతా ఈ వేడుకకు హాజరవుతున్నట్టు సమాచారం. ముఖ్యంగా మెగాస్టార్ చిరంజీవి కుటుంబం అంతా ఈ వేడుకల్లో పాల్గొనబోతున్నది. క్రమం తప్పకుండా మెగాస్టార్ చిరంజీవి ఈ వేడుకలకు హాజరయ్యేవారు. గతేడాది కొన్ని కారణాల వలన హాజరుకాలేకపోయారు. కానీ ఈ ఏడాది మాత్రం మెగా ఫ్యామిలీ హీరోలంతా హాజరు కాబోతున్నారట. ఒకవేళ ఇదే జరిగితే ఫంక్షన్ కు ఇంకాస్త కల రావడం ఖాయం.
తాజా వార్తలు
- హ్యూమన్ ట్రాఫికింగ్ గ్యాంగ్ గుట్టు రట్టు చేసిన విశాఖ పోలీసులు..
- బాంబు దాడుల పై ఈసీ సీరియస్..బాటిళ్లలో ఇక పెట్రోల్‌కు నో
- ఆ దేశంలోని భారతీయ విద్యార్థులందరూ ఇళ్ల నుంచి బయటకు రాకండి: కేంద్ర మంత్రి ఎస్ జైశంకర్
- ప్రొఫెసర్ వెల్చ్ కు యూఏఈ ప్రెసిడెంట్ బంపరాఫర్..!
- యూఏఈలో స్వల్ప భూకంపం
- 'అర్ధరాత్రి దొంగ'కు ఏడాది జైలు, జరిమానా
- బహ్రెయిన్ టాలెంట్ హబ్.. ఔట్రీచ్ నివేదిక వెల్లడి
- పబ్లిక్ టాయిలెట్లలో జెమ్స్ భయమా? Dh10తో పరిష్కారం..!
- దోహా ఇంటర్నేషనల్ బుక్ ఫెయిర్‌లో కొత్త పోటీలు
- యాదాద్రిలో ప్లాస్టిక్ పై నిషేధం..ఉత్తర్వులు జారీ