ప్రపంచంలోనే అతిపెద్ద హెల్త్‌కేర్ స్కీమ్ ప్రారంభించనున్న ఇండియా
- August 14, 2018
దుబాయ్: ఆయుష్మాన్ భారత్ పేరుతో భారత ప్రభుత్వం, ప్రపంచంలోనే అతి పెద్ద హెల్త్ కేర్ స్కీమ్‌ని ప్రారంభించబోతోంది. 100 మిలియన్ మంది ఈ ప్రోగ్రామ్‌లో లబ్దిదారులు కానున్నారు. ఆగస్ట్ 15న భారత స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా ఈ స్కీమ్‌ని ప్రారంభించనున్నారు. ప్రతి కుటుంబానికి 5 మిలియన్ ఇన్స్యూరెన్స్ కవరేజ్ ఈ స్కీమ్ ద్వారా దక్కుతుంది. భారత విదేశాంగ శాఖ సహాయ మంత్రి జనరల్ డాక్టర్ విజయ్‌కుమార్ సింగ్ దుబాయ్‌లోని ఇండియన్ కాన్సులేట్ నిర్వహించిన ఓ కార్యక్రమంలో మాట్లాడారు. విదేశాల్లో స్థిరపడ్డ భారతీయులు, స్వదేశంలో ఆపన్నులకు సహాయమందించాలని ఈ సందర్భంగా ఆయన విజ్ఞప్తి చేశారు. ఇరాక్‌లో ప్రాణాలు కోల్పోయిన భారతీయులు, అలాగే యెమెన్‌లో ఇరుక్కుపోయిన భారతీయుల్ని స్వదేశానికి రప్పించడంలో మంత్రి పోషించిన పాత్ర గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. యూఏఈలో భారత రాయబారి నవ్‌దీప్‌సింగ్ సూరి, భారత కేంద్ర మంత్రికి స్వాగతం పలికారు. యూఏఈ లో మొత్తం 3.5 మిలియన్ మంది భారతీయులు ఉన్నారని, యూఏఈ జనాభాలో వీరిది 33 శాతమని సూరి చెప్పారు.గత రాత్రి ఇండియన్ కాన్సులేట్ ఆడిటోరియం లో మీట్ & గ్రీట్ నిర్వహించారు.ఈ కార్యక్రమములో పలువురు యూ.ఏ.ఈ ప్రముఖులు బి.ఆర్.శెట్టి,ఖాన్,గోపాల్,సజివ్ పురుషోత్తం,డా.చంద్ర శేఖర్ కుంతియా మరియు IPF నుంచి గిరీష్ పంత్,శ్రీనివాస్ జనగామ,కుంభాల మహేందర్ రెడ్డి తదితరులు పాల్గున్నారు.చివరగా సుమతి వాసుదేవన్(కాన్సుల్ జనరల్,దుబాయ్) వోట్ ఆఫ్ థాంక్స్ తెలియజేసారు.

తాజా వార్తలు
- ఐదో టీ20 సిరీస్.. విజేతగా భారత్
- స్త్రీ శక్తి హస్తకళా స్టోర్ ను ప్రారంభించిన నారా భువనేశ్వరి
- తెలంగాణ గల్ఫ్ సమితి ఆధ్వర్యంలో ఉచిత మెగా వైద్య శిబిరం విజయవంతం
- ఆ వృత్తిలోకి ఎవ్వరూ వెళ్లకండి.: పవన్ స్ట్రాంగ్ వార్నింగ్
- ఖతార్‌లో సీజనల్ ఇన్ఫ్లుఎంజా టీకాలపై క్యాంపెయిన్..!!
- బీస్ట్ ల్యాండ్ జోన్ కోసం GEA టిక్కెట్లు ప్రారంభం..!!
- దుబాయ్ ఫిట్నెస్ ఛాలెంజ్ లో యోగా స్పెషల్..!!
- బౌలేవార్డ్ క్రికెట్ గ్రౌండ్ లో "ఇండియా మేళా 2025"..!!
- శాశ్వత వైకల్యం..బాధితుడికి BD 7,000 పరిహారం..!!
- సోషల్ ప్రొటెక్షన్ ఫండ్ ఆన్ లైన్ సేవలకు అంతరాయం..!!







