మహారాష్ట్రలో బ్యాంకు దోపిడి...
- August 14, 2018
తాళాలు పగలగొట్టి, బెదిరించి, కదిలారంటే కాల్చి పారేస్తాం లాంటి దొంగతనాలకు కాలం చెల్లింది. ఇప్పుడంతా ఆన్లైన్ దొంగతనాలు. చదువుకున్న చదువుకి ఆధునిక టెక్నాలజీని జోడించి స్మార్ట్‌గా దొంగతనాలు చేస్తున్నారు. మూడో కంటికి తెలియకుండా మొత్తం మూటగట్టేస్తున్నారు.
మహారాష్ట్ర పూణేకు చెందిన కాస్మోస్ బ్యాంకు ప్రధాన కార్యాలయం సర్వర్‌ను హ్యాక్ చేసి రూ.94.5 కోట్లు కొల్లగొట్టారు. ఈనెల 11న బ్యాంకు సర్వర్‌ను హ్యాక్ చేసిన నిందితులు రూ.78 కోట్లు ఖాళీ చేశారు.
అనంతరం 13న మరో సారి దాడి చేసి రూ. 14 కోట్లు నొక్కేశారు. అంతే కాకుండా నేషనల్ పేమెంట్ కార్పోరేషన్ ఆఫ్ ఇండియా నుంచి మరో రూ.2.5 కోట్లు ట్రాన్స్ఫర్ చేశారు. ఇలా మొత్తం రూ.94.5 కోట్ల నగదును నిందితులు బ్యాంకు నుంచి కొట్టేసినట్లు పోలీసుల విచారణలో తేలింది.
తాజా వార్తలు
- బహ్రెయిన్‌లో అద్దెదారులకు ఊరట..?
- ఒమన్‌లో ప్రవాస మహిళలు అరెస్ట్..!!
- సౌదీలో నాలుగు ప్రాంతాలకు రెడ్ అలెర్ట్ జారీ..!!
- ప్రాంతీయ భద్రతను మరింత బలోపేతం చేయాలి..!!
- అబుదాబిలో 9,237 ఈ-స్కూటర్లు సీజ్..!!
- కువైట్‌లో 6 పోలీస్ స్టేషన్లు తాత్కాలికంగా మూసివేత..!
- కువైట్ విదేశాంగ మంత్రితో షేక్ అబ్దుల్లా బిన్ జాయెద్ ఫోన్లో చర్చలు
- తలారి ముత్తన్న కుటుంబానికి తెలంగాణ గల్ఫ్ సమితి ఆర్థిక భరోసా
- లోక్ భవన్లో గవర్నర్ ఆయుధ పూజలు
- జనవరి దర్శన టికెట్ల విడుదల తేదీలు ఇవే.. పూర్తి షెడ్యూల్







