ఓనం వేడుకలను రద్దు: కేరళ ప్రభుత్వం

- August 14, 2018 , by Maagulf
ఓనం వేడుకలను రద్దు: కేరళ ప్రభుత్వం

కేరళ: వర్ష బీభత్సానికి అల్లాడిపోతున్న కేరళ ఈ ఏడాది ఓనం ఉత్సవాలను రద్దు చేసింది. ఓనం కోసం గతంలో కేటాయించిన రూ.30 కోట్లను తాజాగా ముఖ్యమంత్రి సహాయనిధికి మళ్లించాలని ప్రభుత్వం నిర్ణయించింది. పంటల పండుగగా ఓనం పండుగ సుప్రసిద్ధమైంది. ప్రతీ ఏడాది ప్రభుత్వం ఈ ఉత్సవాలను ఘనంగా నిర్వహిస్తూ ఉంటుంది. కేరళ వత్సరాదిగా చెప్పే ఈ పండుగను పురస్కరించుకుని రాష్ట్రవ్యాప్తంగా వివిధ సాంస్కృతిక కార్యక్రమాలు, ఉత్సవాల నిర్వహణ కోసం ప్రభుత్వం ఇటీవల రూ.30 కోట్లు కేటాయించింది. అయితే, రాష్ట్రాన్ని ఇటీవల వరదలు ముంచెత్తాయి. పదుల సంఖ్యలో ప్రాణాలు కోల్పోగా, లక్షలాదిమంది నిరాశ్రయులయ్యారు. దీంతో ఈ ఏడాది ఉత్సవాలను నిర్వహించుకోబోవడం లేదని ముఖ్యమంత్రి పినరయి విజయన్ తెలిపారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com