హైదరాబాద్ లో సూడాన్ యువకుడు దారుణ హత్య
- August 14, 2018
హైదరాబాద్ నగరంలో ఉన్నత విద్యను అభ్యసించడానికి వచ్చిన రాషెష్ అనే సూడాన్ యువకుడు నిన్న అర్ధరాత్రి దారుణ హత్యకు గురయ్యాడు. హైదరబాద్ శివారు ప్రాంతమైన రాజేంద్రనగర్ పోలీస్స్టేషన్ పరిధిలోని సన్సిటీ సి అండ్టి కాలనీలో ఈ ఘటన జరిగింది. రాషెష్ స్నేహితులైన అబ్దుల్లా,లిసాలతో కలసి రూంలో భోంచేసిన తర్వాత ముగ్గురి మధ్య చిన్న గొడవ మొదలైంది. అదికాస్త చిలికి చిలికి గాలివానగా మారడంతో ఒకరిపై ఒకరు దాడి చేసుకున్నారు.ఈ క్రమంలో క్షణికావేశానికి లోనైన అబ్దుల్లా, లిసాలిద్దరు పండ్లు కోసే కత్తితో రాషెష్ను పొడిచి తీవ్రంగా గాయపరిచారు. దీంతో.. రాషెష్ స్పాట్లోనే మృతి చెందాడు. విషయం తెలుసుకున్న పోలీసులు అబ్దుల్లా ,లిసాలను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.
తాజా వార్తలు
- సౌదీ లో రియల్ ఎస్టేట్ కంపెనీకి SR3.7 మిలియన్ల జరిమానా..!!
- ఓన నిలవ్ 2025: గ్రాండ్ ఓనం వేడుకలు..!!
- కువైట్లో వందేమాతరం 150వ వార్షికోత్సవ వేడుకలు..!!
- ఫేక్ ఎమిరటైజేషన్ను అరికట్టడానికి యూఏఈలో న్యూ రూల్స్..!!
- ఖతార్ విలువైన భాగస్వామి..గ్లోబల్ ఫండ్ చైర్ పర్సన్ ప్రశంసలు..!!
- జర్మన్ జాతీయుడిని రక్షించిన ఒమన్ ఎయిర్ ఫోర్స్..!!
- తిరుమలలో వైకుంఠ దర్శనం తేదీలు ఖరారు!
- అరుదైన చికిత్స చేసిన మెడికవర్ హాస్పిటల్స్
- హైదరాబాద్లో కొత్త అంతర్జాతీయ స్టేడియం!
- అల్ రుస్తాక్-ఇబ్రి మధ్య వాహనాల వేగ పరిమితి తగ్గింపు..!!







